కంగనా రనౌత్‌లా మారిన సాయోని ఘోష్ : ఏకిపారేస్తున్న నెటిజన్లు

Published on Tue, 07/28/2026 - 18:17

సాక్షి, న్యూఢిల్లీ:  పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్‌  బ్రాండ్‌గా,  మమతకు  నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన టీఎంసీ ఎంపీ, నటి సాయోని ఘోష్  (Saayoni Ghosh),  రెబల్ వర్గంలోకి చేరిన తరువాత మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీపై తీవ్ర విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సాయోని ఘోష్ తాజాగా నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సీజేపీ ఆందోళన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం కేంద్రప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన "పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026" (పేపర్ లీకేజీల నిరోధక బిల్లు)కి మద్దతుగా కేంద్రానికి మద్దతుగా గళమెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చకు కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రతిపాదన వక్తగా ఎంపిక చేసింది.

ఈ సందర్బంగా లోక్‌సభలో విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుపై చర్చ ఆగిపోవడంపై సాయోని ఘోష్ మండిపడ్డారు. మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా విపక్షాలు చర్చ నుంచి పారిపోతున్నారంటూ విమర్శించారు. సభలో ప్రతి నిమిషం చాలా విలువైంది. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఈ కొత్త బిల్లులోని సంస్కరణల గురించి తెలిసే హక్కు ఉందన్నారు.  పార్లమెంట్ అనేది రాజకీయ ఘర్షణలకు వేదిక కాకూడదని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో సమిష్టి చర్చలు జరగాలని ఆమె పిలుపునిచ్చారు. విపక్షాలు కేవలం రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.

 

2024 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నుంచి గెలిచిన సాయోని, పార్లమెంట్‌లో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు. తాము రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పోరాడతాం.. చేతుల్లో కత్తులు పట్టుకుని కాదంటూ చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి.  ప్రస్తుతం  ఎన్‌డీఏ మద్దతు దారుగా ఇప్పుడు అదే సాయోని ఘోష్,  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా సమర్థిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడటం గమనార్హం.

నెటిజన్లు స్పందన
ఆమె తాజా కామెంట్లపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ప్రవర్తన బీజేపీ గురించేకాదు ఆమె వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతోందని , అసలు నైతిక విలువలే లేవని మండిపడ్డారు. ఇలాంటి నీచమైన వారిని మమతా బెనర్జీ పెంచి పోషించారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్‌ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు

ఆమె ఎప్పుడూ అలాగే ఉంటుంది! తన పార్టీకి సంబంధించి తనకు ఉన్న ప్రస్తుత అవగాహన సరైనదని ఆమె నిజంగా నమ్మితే, ఆమె ఆలోచన సరైనదే కావచ్చు. కానీ అందుకు ఆమెకు అత్యున్నత స్థాయి నిజాయితీ, చిత్తశుద్ధి అవసరమన్నారు మరొకరు. టీఎంసీ  ఎంపీగా గెలిచి,  ఇపుడు వ్యతిరేకంగా మారడం మీనియోజకవర్గ ప్రజలు పన్ను చెల్లింపుదారులకు , ఓటర్లకు చేసిన ద్రోహం అని ఒకరు కామెంట్‌ చేశారు.  అంతేకాదు  ఆమె 12వ తరగతి అతి కష్టమ్మీద పాస్ అయ్యింది, ఆమె మాటల్లో దూకుడు ఉండేది కానీ, ఆమె మేధావి కాదు అని మరొకరు మండిపడ్డారు. 

ఇదీ చదవండి: షాకింగ్‌ : భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్‌!

ఆమెకు, ఆమె లాంటి వారికి ఎలాంటి చిత్తశుద్ధి గానీ, వ్యక్తిత్వం గానీ లేవు. సిగ్గులేని అవకాశవాదులు. పార్టీ మారిన వెంటనే ఆమె భావజాలం, సూత్రాలు అన్నీ మారిపోయాయా? బహుశా ఆమెకు మొదట్నుంచే ఎలాంటి బలమైన నమ్మకాలు లేవేమో. లేకపోతే అంత తీవ్రంగా తన ఆత్మను ఎలా అమ్ముకోగలరు? మీలాంటి భజనపరులను 'ద్రోహులు' (ధోకేబాజ్) అంటారు.

చాలా మంది అవకాశవాదులు మమత పని అయిపోయిందని భావిస్తున్నారు. ఆమె విధానాలు లేదా కొన్ని వర్గాల పట్ల ఆమె అనుసరించే  ధోరణితో విభేదాలు ఉండవచ్చు, కానీ బెంగాల్ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నప్పుడే మమత తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే, ఆమె సొంత పార్టీవారే ఆమెకు ఎలా ద్రోహం చేశారో ప్రజలు గుర్తుంచు కుంటారన్నారు మరొకరు.

అంత గొప్పవారైతే, రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై మళ్లీ ఎన్నికై ఉండాల్సింది అని ఒకరంటే, నిజానికి ఆమె ఒక పరిణతి చెందిన నటి. అప్పుడు నటించింది, ఇప్పుడు కూడా నటిస్తోంది. ఆమెకు కేవలం సరదాగా గడపాలని మాత్రమే ఉందనంటూ నెటిజన్లు  స్పందిస్తున్నారు.

కాగా ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో TMC ఘోర పరాజయం పాలైన తర్వాత, మమతా బెనర్జీపై తిరుగు బాటు చేసి ఆమె పార్టీని వీడారు.   ఆ తర్వాత ఆమె కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP/NCPI)లో చేరి, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి మద్దతుదారుగా మారారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)