Breaking News

ఆ రూ. 40 వేలతోనే : రామమందిర్‌ విరాళాల గోల్‌మాల్‌ గుట్టు

Published on Fri, 07/17/2026 - 14:46

అయోధ్య రామ మందిర విరాళాల  గోల్‌​మాల్‌  కేసులో ఒకదాని తర్వాత ఒకటిగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ట్రస్టీల అవినీతి, విలాసాలు, స్టాక్‌మార్కెట్‌తో సంబంధాలు లాంటి ఇప్పటికే బైటపడగా, తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిపై అభియోగాలు నమోదైనాయి. ఈభారీ కుంభ కోణం నిందితులను పట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అయితే, అసలు ఇంత  పెద్ద కుంభకోణం  ఎలా బయటపడిందో తెలుసా?

ఒక వాచ్‌మన్ నిజాయితీ కారణంగా రామమందిరంలోని విరాళాల చోరి వ్యవహారం వెలుగు లోకి వచ్చాయి. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, మే నెల చివరి వారంలో ఆలయ ప్రాంగణంలోని ఒక బాత్రూంలో దాదాపు 40 వేల రూపాయలు నగదును గుర్తించి, గేటు వద్ద కాపలాగా ఉన్న గార్డు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లోని ఒక ట్రస్టీకి తెలియ జేశాడు. ఈ సమాచారం అందగానే ఆయన హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు, ఆ తర్వాత భద్రతా సిబ్బందికి, ఇతర ట్రస్ట్ సభ్యులకు విషయం తెలియజేశారు. నగదు దొరకడంతో విరాళాల సొమ్మును అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలు తలెత్తాయి. దీనిపై ట్రస్ట్‌ జూన్ 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 17 గంటల వ్యవధిలోనే అయోధ్య, యూపీలోని ఇతర జిల్లాల్లోని పలు ప్రాంతాలపై దాడులు నిర్వహించి దాదాపు రూ. 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విరాళాల లెక్కింపు కేంద్రంలో పనిచేసే అనుమానిత ఉద్యోగులను పోలీసులు తీవ్రంగా విచారించారు. 

పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుడు రామశంకర్ మిశ్రా ఇంటిలో, మరో నిందితుడు అవినాష్ శుక్లా పూర్వీకుల ఇంట్లో, ఇతర ప్రదేశాలలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు, ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు నమోదైన 17 గంటల లోపే, ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి పోలీసులు అయోధ్య మరియు యూపీలోని ఇతర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుండి దాదాపు రూ. 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

మరోవైపు దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం తననివేదికను సమర్పించాల్సి ఉంది. తొలుత సిట్‌కు 15 రోజుల గడువు ఇవ్వగా, జూలై 1న ఆ గడువును మరో 15 రోజులు పొడిగించారు. ఈ నివేదిక ఆధారంగా, అయోధ్య రామాలయ నిర్వహణ, ముఖ్యంగా విరాళాల లెక్కింపు ప్రక్రియలోపారదర్శకత ఉండేలా ప్రభుత్వం, ట్రస్ట్ అధికారులు భారీ మార్పులు తీసుకురావడానికి సిద్ధమవు తున్నారు.

ఇదీ చదవండి: తొలి హైడ్రోజన్‌ రైలు : దీని ప్రత్యేకతలివే!

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)