Breaking News

ఇంటి నుంచే కుంభమేళా స్నానం.. ఎలాగంటే..

Published on Mon, 01/13/2025 - 13:50

మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది.  కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. అయితే పలు కారణాల దృష్ట్యా అందరికీ కుంభమేళాకు వెళ్లే అవకాశం లభించదు. అలాంటప్పుడు చింతించకుండా ఉండేందుకు ఒక మార్గాన్ని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు.

కుంభమేళాకు వెళ్లే అవకాశం లేనివారు ఈ మేళాకు వెళ్లినవారిని అడిగి కుంభమేళా జలాలను తీసుకోవాలని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ఆ నీటిని మీ ఇంటిలోని నీటి బకెట్‌లో వేసుకుని, ఆ నీటితో స్నానం చేయాలని తెలిపారు. ఇలా చేయడం ద్వారా కుంభస్నానం చేసినంతటి ఫలితాలనే పొందుతారని శంకరాచార్య స్వామి అన్నారు.  

మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నుంచి నీటిని,  ప్రసాదాన్ని పంపేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు  ఉన్నాయి. వాటిని సంప్రదించి మన ఇంటికి నీటిని తెప్పించుకోవచ్చని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ‘త్రివేణి సంగమ్‌ వాటర్ డెలివరీ సర్వీస్’ కుంభమేళా నుండి నీటిని ఇంటికి నేరుగా డెలివరీ చేస్తోందని తెలిపారు.

ఏదైనా కారణం చేత  మహా కుంభమేళా నీటిని మీరు పొందలేకపోతే మీ ఇంట్లో ఉంచుకున్న గంగా జలంలోని కొన్ని చుక్కలను బకెట్‌లో కలుపుకుని స్నానం చేయడం ద్వారా కూడా పుణ్యం పొందవచ్చని శంకరాచార్య స్వామి తెలిపారు. ఇలా స్నానం చేసిన తరువాత దానధర్మాలు చేయడం ఉత్తమఫలితాలనిస్తుందని తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: ఒక్కో ఘాట్‌కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)