Breaking News

భయానక అనుభవం.. ఉగ్ర దాడి నుంచి ఆ బృందం ఎలా తప్పించుకుందంటే?

Published on Thu, 04/24/2025 - 17:34

శ్రీనగర్‌: అందాల కశ్మీరంలో పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. వారిపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. 20 మందికి పైగా  గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బిహార్‌ తదితర రాష్ట్రాలకు చెందినవారు. వారిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ బృందం ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకుంది.

కేరళ నుంచి చిన్నారి సహా దాదాపు 23 మంది కశ్మీర్‌ పర్యటనకు వచ్చారు. వాళ్లంతా బైసరన్‌ ప్రాంతంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్లారు. అయితే, టూరిస్ట్‌ స్పాట్‌కు వెళ్లాలంటే గుర్రంపైన వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వారు గుర్రపు స్వారీ ఖరీదు అధికంగా ఉండటంతో వేరే ప్రదేశానికి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లిపోయారు. దీంతో ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో పడ్డారు.

వేరే ప్రదేశానికి వెళ్తున్న టైంలో తమకు కొన్ని భారీ శబ్దాలు వినిపించాయని.. దుకాణాలు మూసివేస్తున్నారని.. ప్రజలు కూడా పారిపోతున్నారని ఆ పర్యాటకులు వివరించారు. అక్కడ ఏం జరుగుతోందో తమకు అర్థంకాలేదన్నారు. మేము అందమైన ప్రదేశానికి తీసుకెళ్లమని తమ గైడ్‌ను అడిగామని.. బతికి ఉండాలనుకుంటున్నారా..? లేదా..? అని. ట్యాక్సీ అతను సరాసరి తామున్న హోటల్‌ వద్దకు తీసుకెళ్లాడన్నారు. టీవీలో వార్తలు చూసిన తర్వాత అక్కడ ఉగ్రదాడి జరిందని.. గుర్రపు స్వారీకి వెళ్లి ఉంటే తమ పరిస్థితి ఎలా ఉండేందోనంటూ భయంకరమైన అనుభవాన్ని వివరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)