Breaking News

పావుగంటలో పట్టుకొచ్చారు..  థాంక్యూ సార్‌

Published on Sun, 01/11/2026 - 05:51

లఖీంపూర్‌ ఖేరీ(యూపీ): గతంతో పోలిస్తే నేడు ఆన్‌లైన్‌ బుకింగ్‌ వంటి సౌకర్యాలకారణంగా వంటగ్యాస్‌ సిలిండర్‌ను కేవలం 15 నిమిషా ల్లోనే ఇంటి వద్ద డెలివరీ తీసుకోగలిగానని ప్రధాని మోదీకి ఒక గృహిణి తన అమితానందాన్ని ఒక లేఖ ద్వారా వ్యక్తంచేశారు. ఈ వివరాలను శనివారం ప్రధాని మోదీ స్వయంగా అందరితో పంచుకున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఘటన తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

 ఉత్తర ప్రదే శ్‌లోని లఖీంపూర్‌ పట్టణానికి చెందిన అరుణశ్రీ డాన్‌ బాస్కో స్కూల్‌లో ఉపాధ్యాయురాలు. గత ఏడాది డిసెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్‌ను బుక్‌ చేయగా కేవలం 15 నిమిషాల్లో డెలివరీ బాయ్‌ సిలిండర్‌ను ఇంటి వద్దకు పట్టుకొచ్చాడు. ఆశ్చర్యపోయిన ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘‘ ఆనందం, ఉద్వేగంతో ప్రధానికి లేఖ రాశా. జీవితాలను ఇంత సులభతరంగా మార్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపా. 

నా చిన్నతనంలో ఎల్పీజీ కనెక్షన్‌ తీసుకోవాలన్నా, సిలిండర్‌ మార్చుకోవాలన్నా ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. ఆకాలం పోయి ఒక్క ఫోన్‌కాల్‌తో సిలిండర్‌ ఇంటి వద్దే ప్రత్యక్షమవుతోంది. ఈ ఘనత ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వానిదే’’ అని ఆమె అన్నారు. లేఖపై మోదీ స్పందించారు.  మహిళా సాధికారత కోసం తామెన్నో కేంద్ర పథకాలను అమలుచేస్తున్నామని మోదీ గుర్తుచేశారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)