Breaking News

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ.. ఢిల్లీలో కొత్త బంగ్లా

Published on Fri, 07/26/2024 - 17:02

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. సునేహ్రీ బాగ్‌ రోడ్‌లోని నెంబర్‌ 5 బంగ్లాను రాహుల్‌కు హౌస్‌ కమిటీ ఆఫర్‌ కల్పించినట్లు సమాచారం. ఈ మేరకు రాహుల్‌ సోదారి ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లినట్లు వినికిడి. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

కాగా పరువునష్టం కేసులో రాహుల్‌కు సూరత్‌ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం దిల్లీలోని 12-తుగ్లక్‌ లేన్‌లోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని పార్లమెంటరీ హౌసింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌  ఆ ఇంటిని ఖాళీ చేసి.. 10 జన్‌పథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసానికి మారారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు.

ఇదిలా ఉండగా  2004లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి గతేడాది ఏప్రిల్‌ వరకు రాహుల్‌..  12- తుగ్లక్‌ లేన్‌ బంగ్లాలోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్‌ లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. దీంతో ఆయన కేబినెట్‌ హోదాను కలిగి ఉన్నందున టైప్‌ 8 బంగ్లాకు రాహుల్‌ అర్హుడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)