Breaking News

ఇండియన్‌ ఆర్మీ ఆన్‌ ఫైర్‌.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం

Published on Sat, 04/26/2025 - 10:56

శ్రీనగర్‌: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. శుక్రవారం ఐదుగురు కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. సోఫియాన్‌, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో.. కశ్మీరి ఎల్‌ఈటీ ఆపరేటివ్స్‌పై ఉక్కుపాదం మోపే క్రమంలోనే సైన్యం ఈ చర్యలకు ఉపక్రమించింది.

పుల్వామాలో ఎసాన్‌ ఉల్ హక్‌, షోపియాన్‌లోని చోటీపోరాలోని షాహిద్‌ అహ్మద్‌ , కుల్గాంలో జకీర్‌ గని ఇళ్లు బుల్డోజర్‌, పేలుడు పదార్థాల సాయంతో నేలమట్టం చేశారు. సోషియాన్‌లో చోటిపోరా గ్రామంలో ఎల్‌టీ కమాండర్‌ షాహిద్‌ అహ్మద్‌ కుట్టే నివాసానికి బుల్డోజర్‌ సాయంతో నేలమట్టం చేసినట్లు సమాచారం. షాహిద్‌ అహ్మద్‌ గత నాలుగు ఏళ్లుగా జమ్ములో జాతి వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడు. కుల్గాంలోని మటలం ఏరియాలో జహిద్‌ అహ్మద్‌(జకీర్‌ గని) నివాసాన్ని కూల్చేశారు. 

 

పుల్వామా ముర్రాన్‌ ప్రాంతంలో ఎషన్‌ ఉల్‌ హక్‌ ఇంటిని పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. 2018 నుంచి పాక్‌లో ఉగ్రశిక్షణలో ఉన్న అషన్‌.. ఈ మధ్యే తిరిగి కశ్మీర్‌లో అడుగు పెట్టినట్లు నిఘా వర్గాల సమాచారం. 

ఎల్‌ఈటీ ఉగ్రవాది ఇషాన్‌ అహ్మద్‌ షేక్‌కు సంబంధించిన రెండంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. ఇక.. పుల్వామా కాచిపోరా ప్రాంతంలో హరిస్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది ఇంటిని అధికారులు పేలుడుతో కుప్పకూల్చారు.

ఇదిలా ఉంటే.. అంతకుముందు జమ్ము కశ్మీర్‌ లోకల్‌ టెర్రరిస్టులు ఆసిఫ్‌ షేక్‌, అదిల్ మహమ్మద్‌ ఇళ్లను తనిఖీలు చేసిన టైంలో.. అందులో అమర్చిన పేలుడు పదార్థాల ధాటికి ఇద్దరి ఇళ్లు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. ఇది సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరి చేసిన ప్లాన్‌గా భారత బలగాలు భావిస్తున్నాయి.

LOC వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు

ఇక.. అసిఫ్‌ షేక్‌ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు ముజాహుద్దీన్‌ అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్‌ సోదరి
తమ ఇల్లు నేలమట్టం కావడంతో.. ప్రస్తుతం ఆమె బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందుతోందట. ఇక అసిఫ​ మరో సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నట్లు వెల్లడించింది ఆమె. 

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు