Breaking News

ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఏటీఎస్‌.. యాంటీ టెర్రర్‌ గ్రిడ్‌ 

Published on Sat, 12/27/2025 - 05:54

న్యూఢిల్లీ: దేశంలోని పోలీసు వ్యవస్థ కోసం ఏటీఎస్‌(అప్లికెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌)ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. అదేవిధంగా, యాంటీ టెర్రర్‌ గ్రిడ్‌ను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ఉగ్రదాడులను ప్రతి స్థాయిలోనూ ఉమ్మడిగా వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని చెప్పారు. ‘వ్యవస్థీకృత నేరాలపై 360– డిగ్రీల దాడి’అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 

జీరో టెర్రర్‌ పాలసీకి ఇది అత్యంత కీలకంగ మారనుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం మొదలైన రెండు రోజుల యాంటీ టెర్రరిజమ్‌ కాన్ఫరెన్స్‌–2025లో మంత్రి అమిత్‌ షా ప్రసంగించారు. ‘బలవంతంగా డబ్బు వసూలు చేయడమనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు ఏర్పడుతాయి. వాటి నేతలు విదేశాలకు పారిపోయి, అక్కడే స్థిరపడిపోయాక.. ఇక్కడుండే నెట్‌వర్క్‌ ఉగ్ర గ్రూపుల ఆ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. 

అటు తర్వాత, ఆ నెట్‌వర్క్‌ ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు దోహదపడుతోంది’అని అమిత్‌ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గనైజ్డ్‌ క్రైం నెట్‌వర్క్‌ డేటాబేస్, వెపన్స్‌ డేటా బేస్‌ ఫర్‌ లాస్ట్, లూటెడ్‌ అండ్‌ రికవరీ ఆరŠమ్స్‌కు సంబంధించిన రెండు డేటాబేస్‌లను ఆయన ప్రారంభించారు. జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్‌ఐఏ) రూపొందించిన ఈ డేటాబేస్‌లను దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా విభాగాలు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. వీటితోపాటు ఉగ్రవాదులు, నేరగాళ్లకు సంబంధించిన డేటాబేస్‌లను కూడా రూపొందించాలని సూచించారు.   
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)