Breaking News

లగ్జరీ అపార్ట్‌మెంట్‌ : గోడకు పెన్సిల్‌తో రంధ్రం?! వైరల్‌ వీడియో

Published on Tue, 11/11/2025 - 17:29

ఇల్లు కొనాలంటే మాటలు కాదు. ఇంటి నాణ్యత, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు గురించి కచ్చితంగా తనిఖీ చేసుకుంటాం. ఒకటిరెండు సార్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదోనని చెక్‌ చేసుకుని మరీ ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనాలా లేదా అని నిర్ణయం తీసుకుంటాం కదా. మరి కోటిన్నర రూపాయలు పెట్టి కొన్న ఒక అపార్ట్‌మెంట్ గోడ ఒక్క పెన్సిల్‌ మొనకే రంధ్రం పడితే.. గుండె గుభిల్లు మనదూ.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట  సంచలనంగా మారింది. 

నోయిడాకు చెందిన వ్యక్తి రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ గోడకు పెన్సిల్తో రంధ్రం చేయడం చర్చనీయాంశమైంది. నోయిడా నివాసి తన రూ.1.5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ గోడకు చెక్క పెన్సిల్‌తో రంధ్రం చేశాడు.ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని ఖరీదైన గృహనిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే భద్రత , సామగ్రి గురించి ఆందోళనలను రేకెత్తించింది.

kabeer.unfiltered' అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేసిన వీడియోలో, తన ప్రీమియం అపార్ట్‌మెంట్ గోడలోకి చెక్క పెన్సిల్‌ను సుత్తితో కొట్టడాన్ని చూడొచ్చు. కేవలం పెన్సీల్‌తో గోడకు సుత్తి సాయంతో రంధ్రం చేశానని తెలిపాడు.  మొదట డ్రిల్‌ను ఉపయోచాలని చూశా. కానీ  డ్రిల్ కూడా అవసరం లేకుండానే, పెన్సిల్‌   నేరుగా గోడలోకి దిగిపోయింది.  ఇది  మనం పాఠశాలలో వాడే గ్రాఫైట్‌ పెన్సిలే. ఈ ఇల్లు అంత బలంగా ఉంది అని రాసుకొచ్చాడు.

దీనిపై చాలామంది నెటిజన్లు  ఆశ్చర్యపోయారు.  కోటి రూపాయలు  పెట్టుబడి పెట్టి మోసపోవడం బాధాకరం అంటూ వాపోయారు.  మరికొందరు భిన్నమైన దృక్పథాన్ని అందించారు. AAC (ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్) గోడలు అని, ఈ తేలికైన గోడలను ఎత్తైన నిర్మాణంలో ఉపయోగిస్తారని, భూకంపాల సమయంలో ఇది సురక్షితంగా, మరింత స్థిరంగా ఉంటుందని  పేర్కొన్నారు. ఈ గోడలు భారాన్ని మోసేవి కావు , సాంప్రదాయ ఇటుక, మోర్టార్ గోడల మాదిరిగా ఉండవని వివరణ ఇచ్చారు. పేరు తగ్గట్టే ఏఏసీ గోడలు. ఇవి డ్రిల్లింగ్‌కు ఈజీగా ఉంటాయ్‌.. అందుకే తెలుసుకొని మాట్లాడాలి అంటూ  కమెంట్‌ చేశారు.

 కాగా ఈ వీడియో  ప్రామాణికత, గోడ నాణ్యత లాంటి విషయాలపై  క్లారిటీ లేదు. ఈ వీడియోలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా  తన వ్యక్తిగత అనుభవాలు ,పరిశీలనల ఆధారంతో రాసింది . ఈ కంటెంట్ ఏ వ్యక్తిని, కంపెనీని లేదా సంస్థను కించపరచడానికి ఉద్దేశించింది  కాదంటూ డిస్‌క్లైమర్‌ కూడా ఇచ్చాడు.  ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్‌లు తేలికైన, ప్రీకాస్ట్ నిర్మాణ సామగ్రి. వీటితో ఖర్చు తక్కువ. తేలికైనవి, సౌకర్యవంతమైనవి, మన్నికైనవి కూడా. అద్భుతమైన ఇన్సులేషన్ లక్షణాలను కలిగి ఉంటాయి.వీటి వలన భవనం చల్లగా ఉంటుంది. అగ్ని, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. చెద లాంటి సమస్యలు కూడా ఉండవు.  

ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్‌ హౌస్‌, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)