Breaking News

ట్రంప్​, అమితాబ్​లకు లాక్​డౌన్​ పాసులు!!

Published on Sat, 06/05/2021 - 14:00

సిమ్లా: లాక్​డౌన్​ టైంలో జనాల అత్యవసరాల సేవల కోసం పోలీసులు ఈ‌‌-పాస్​లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్​ పోలీసుల నిర్వాకంపై జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, బాలీవుడ్ మెగాస్టార్​ అమితాబ్ బచ్చన్​లకు లాక్​డౌన్​ ఈ‌‌-పాస్​లు జారీ చేశారు అక్కడి పోలీసులు. ఈ వ్యవహారం మీడియాలో హైలైట్​ కాగా, ఈ వ్యవహారం వెనుక ఉన్న జర్నలిస్ట్​పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వ్యవహారం కోర్టుకి చేరింది.

లాక్​డౌన్​ టైంలోనూ ప్రైవేట్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో యథేచ్చగా తిరుగుతుండడంతో అమన్ కుమార్ భరద్వాజ్​ అనే జర్నలిస్ట్​ ‘ఈ-పాస్​ వ్యవహారం’పై అనుమానపడ్డాడు. తన ఆధార్​ వివరాల్ని ఇచ్చి.. ట్రంప్​, అమితాబ్ ఫొటోలతో పాస్​ల కోసం పోలీస్​ ప్రత్యేక వెబ్​ పోర్టల్​లో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కనీసం ఆ ఫొటోల్ని కూడా పట్టించుకోకుండా, దరఖాస్తుల్ని కూడా వెరిఫై చేయకుండానే పాస్​లు జారీ చేశారు పోలీసులు. ఈ వ్యహారంపై మే 5న అమన్​ కుమార్​ రిపోర్ట్ చేసిన స్టోరీ టీవీ ఛానెల్​లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో పోలీసులు అదే రోజు సాయంత్రం ఆ జర్నలిస్ట్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్ట్​, ఐటీ యాక్ట్​ సెక్షన్​ల కింద అరెస్ట్ కోసం ప్రయత్నించారు. 

ఈలోపే అమన్ అప్రమత్తమై హైకోర్టును ఆశ్రయించాడు. ఈ-పాస్​ల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందని, పత్రికా స్వేచ్ఛను పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారంటూ పిటిషన్​లో పేర్కొన్నాడు. అయితే అతని విజ్ఞప్తిని మన్నించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు.. ఈ వ్యవహారంలో పోలీసులపై అక్షింతలు వేసింది. అంతేకాదు ఈ కేసు విచారణలో తదుపరి వాదనల వరకు అమన్​ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.

చదవండి: సంసారానికి పనికి రాడనడం దాని కిందకే లెక్క!

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)