Breaking News

పీఎస్‌సీలో హైటెక్‌ చీటింగ్‌.. షర్టు కాలర్‌లో ఇయర్‌ఫోన్‌, కెమెరా..

Published on Mon, 09/29/2025 - 16:57

కన్నూర్: ఆధునిక టెక్నాలజీ అందించిన పరికరాలను సక్రమ రీతిలో వినియోగించాల్సిన కొందరు వాటిని అక్రమ పద్ధతులకు ఉపయోగిస్తూ, లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేరళలోని కన్నూర్‌లో జరిగిన పీఎస్‌సీ సెక్రటేరియట్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలో ఒక యువకుడు హైటెక్ మోసానికి పాల్పడి  అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

‘మనోరమ’లో ప్రచురితమైన కథనం ప్రకారం కన్నూర్‌లోని ముండలూర్‌లోని పెరలస్సేరీలోని సురూర్ నివాస్‌కు చెందిన ఎంపీ ముహమ్మద్ సహద్ (25) పరీక్షలో చీటింగ్‌కు పాల్పడుతూ ఇన్విజిలేటర్ల కంటపడ్డాడు. వారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరుగునందుకున్నాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకుని అరెస్ట్‌ చేశారు. ఈ  ఘటన పయ్యంబలం ప్రభుత్వ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో జరిగింది. ముహమ్మద్ సహద్ తన షర్టు కాలర్‌లో సీక్రెట్‌ కెమెరా అమర్చాడు. బయటకు కనిపించని విధంగా ఇయర్‌ఫోన్స్‌ కూడా అమర్చుకున్నాడు.

ప్రశ్నాపత్రాన్ని కెమెరా ద్వారా బయటి వ్యక్తులకు చూపించి, ఇయర్‌ ఫోన్‌ ద్వారా సమాధానాలు వింటూ, పరీక్ష రాసే ప్రయత్నం చేశాడు. అయితే పరీక్షా హాలులోని అధికారులు అతనిని తనిఖీ చేసి,కెమెరా, పెన్ డ్రైవ్,హెడ్‌సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తాను గతంలో కూడా ఇదే విధంగా పరీక్షలలో మోసం చేసినట్లు అంగీకరించాడు. సహద్ గత నెలలో జరిగిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షలోనూ ఇదే విధంగా కాపీ కొట్టాడు. నిందితుడు ఇప్పటివరకు రాసిన పరీక్షల సమాధాన పత్రాలను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)