Breaking News

బెంగళూరులో వర్ష బీభత్సం.. రూ.2 కోట్ల బంగారం కొట్టుకుపోయింది!

Published on Tue, 05/23/2023 - 15:23

బెంగళూరు: గార్డెన్‌ సిటీగా పిలుచుకునే బెంగళూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమానికి తీవ్రంగా నష్టపోయాడు. 

వివరాల్లోకి వెళితే..  మల్లీశ్వర్‌లోని 9వ క్రాస్‌లోని ఓ నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. కాసేపు తర్వాత అధికంగా వరద నీరు షాపులోకి రావడంతో అక్కడున్న బంగారు నగలు కొట్టుకుపోయాయి. దాదాపు రూ.2 కోట్ల విలువైన నగలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దుకాణం సమీపంలో జరుగుతున్న పనులే నష్టానికి కారణమని దుకాణం యజమాని ఆరోపిస్తున్నాడు.  షాపులోని బంగారు ఆభరణాలు తడిసిపోయాయి.. కార్పొరేషన్‌కు ఫోన్ చేసి సహాయం కోరినా అధికారులు సాయం చేయకపోవడంతో 80 శాతం నగలు మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయింది. వానల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోడంతో పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్‌ కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు ఇప్పటివరకు 600 వరకు ఫిర్యాదులు అందాయి. 

చదవండి: వేదికపై ఫ్రెండ్స్‌ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)