Breaking News

వైన్స్‌ షాపులో ఐదు గంటల హైడ్రామా! ప్రాణాలకు తెగించి..

Published on Tue, 07/21/2026 - 10:40

ఉదయం వేళ.. అంతా సాధారణంగానే సాగుతోంది. షాప్‌లో పనులు చేసుకుంటున్న సిబ్బందికి కాసేపట్లో ఎదురుకాబోయే ప్రమాదం గురించి అసలు ఊహే లేదు. ఇంతలో ఒక్కసారిగా.. ఆకోశ్రంతో ఉన్న ఓ చిరుత అక్కడికి దూసుకొచ్చింది. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న ప్రదేశం భయానకంగా మారిపోయింది. ఎదురుగా క్రూర మృగం.. తప్పించుకునే అవకాశం దాదాపు లేదు. అప్పటికే చిరుత దాడిలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే.. 

ఆ సమయంలో ఓ సేల్స్‌మెన్‌ చూపించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాణాలకు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయంతో అతడు పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన రాజస్థాన్‌లోని టోంక్‌ జిల్లా టోడారాయ్‌సింగ్‌ పట్టణంలో సోమవారం (జూలై 20) ఉదయం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో స్థానిక ప్రాంతంలోని పొదల్లో చిరుత దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. అటవీ వాలంటీర్‌ రాకేష్‌ దాన్ని గుర్తించి దగ్గరకు వెళ్లాడు. చిరుతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగానే.. అది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే ఆ జంతువు అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని ఓ లిక్కర్‌ షాప్‌ వైపు పరుగులు తీసింది.

చిరుత ఒక్కసారిగా షాప్‌లోకి దూసుకురావడంతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. మొదట షాప్‌ యజమాని ఫతే లాల్‌ కోలీపై అది దాడి చేసింది. ఆ తర్వాత లోపల ఉన్న సేల్స్‌మెన్‌ సంజయ్‌ గుర్జర్‌పై విరుచుకుపడింది. చిరుత దాడిలో సంజయ్‌కు ముక్కు, భుజం, చేతులపై గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు భయంతో కుప్పకూలిపోలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తెగువ చూపి సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.

చిరుతను బయటకు వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ప్రమాదం తప్పదని సంజయ్‌ గ్రహించాడు. ఆ క్షణంలో తన ప్రాణాలను పణంగా పెట్టి షాప్‌ షట్టర్‌ను కిందికి దించాడు. దీంతో చిరుత లోపలే చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జైపూర్‌ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఆపరేషన్‌ తర్వాత చిరుతకు మత్తు మందు ఇచ్చి సురక్షితంగా పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. షాప్‌లో చిరుత సంచరించిన తీరు, రెస్క్యూ ఆపరేషన్‌, సేల్స్‌మెన్‌ ధైర్యం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు నాలుగు కాళ్ల మృగం.. మరోవైపు గాయాలతో ఉన్న పరిస్థితి.. అయినప్పటికీ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయంతో సంజయ్‌ పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. చిరుతను బంధించింది అటవీ శాఖ బృందమే అయినా.. ఆ ఐదు గంటల హైడ్రామాలో తొలి హీరో మాత్రం సేల్స్‌మెన్‌ సంజయ్‌ గుర్జర్‌నే అని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)