Breaking News

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

Published on Mon, 06/22/2026 - 13:42

“పిల్లలు సెటిల్‌ అయిపోయారు. హమ్మయ్యా.. ఇంక రిటైర్మెంట్‌ తర్వాత హాయిగా జీవిద్దాం” అని ఎన్నో కలలు కనే వాళ్లు ఉంటారు. కానీ ఆ కలలన్నీ నిజం కావడానికి జీవితం అవకాశం ఇస్తుందనే గ్యారంటీ లేదు. 37 ఏళ్ల పాటు ఉద్యోగానికే జీవితాన్ని అంకితం చేసిన ఓ పెద్దాయన.. తన జీవితంలోని అరుదైన క్షణం కోసం ఎదురు చూశాడు. కానీ, విధి వింత నాటకం ఆడింది. ఓ వైద్యురాలు సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

68 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కలచివేసింది ఆయన భార్య చెప్పిన విషయం.

వైద్యురాలు డాక్టర్‌ ధివ్య ధ్యానా సోషల్‌ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పెద్దాయన కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. అదే కంపెనీలో ఏకంగా 37 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగ జీవితమంతా కుటుంబ పోషణకే ప్రాధాన్యం ఇచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలో కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, వ్యక్తిగత ఆనందాలన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాడు. “ఇప్పుడు కష్టపడతాను.. రిటైర్‌ అయిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తాను” అని భార్యకు తరచూ చెప్పేవాడట.

చివరకు రిటైర్మెంట్‌ వచ్చిన తర్వాత భార్యతో కలిసి నెల రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో జరగాల్సిన ఆ పర్యటన కోసం టికెట్లు, హోటల్‌ బుకింగ్‌లు సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కలల యాత్ర ప్రారంభం కాకముందే ఆయన గుండెపోటుతో మరణించాడు.

ఈ ఘటనను వివరిస్తూ డాక్టర్‌ ధివ్య ధ్యానా భావోద్వేగానికి గురయ్యారు. “37 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న వ్యక్తి.. ఆ క్షణం వచ్చేలోపే వెళ్లిపోయాడు. ఇలాగే ఎంతో మంది తమ సమయం, ఆరోగ్యం, స్వేచ్ఛను త్యాగం చేస్తూ భవిష్యత్తు కోసం మాత్రమే జీవిస్తున్నారు” అని పేర్కొన్నారామె.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది నెటిజన్లు స్పందిస్తూ.. తమ కుటుంబాల్లోనూ ఇలాంటి కథలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్‌ తర్వాత జీవితాన్ని ఆస్వాదిద్దామనుకుని.. ఆ అవకాశమే దక్కని బంధువులు, స్నేహితుల గురించి గుర్తుచేసుకుంటున్నారు. 

జీవితం ఎప్పుడూ మన ప్రణాళికల ప్రకారం సాగదని.. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని పూర్తిగా త్యాగం చేయడం సరైనది కాదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పని, బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా.. కుటుంబంతో గడిపే సమయం, ఆరోగ్యం, చిన్న చిన్న ఆనందాలు కూడా అంతే విలువైనవని నిపుణులు సూచిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)