Breaking News

హరియాణా బీజేపీఎల్పీ నేతగా సైనీ

Published on Thu, 10/17/2024 - 04:32

చండీగఢ్‌/ పంచకుల: హరియాణా బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా నాయబ్‌సింగ్‌ సైనీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. బుధవారం పంచకులలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ నాయకుడిగా ఎన్ను కున్నారు. సైనీ పేరును ఎమ్మెల్యే క్రిషన్‌ కుమార్‌ బేడీ ప్రతిపాదించగా.. సీనియ ర్‌ నేత అనిల్‌ విజ్‌ బలపరిచారు. అనిల్‌ విజ్‌ సైతం సీఎం పదవిని ఆశించినప్పటికీ బీజేపీ అగ్రనేతలు సైనీ వైపు మొగ్గారు. 

పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. సైనీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం సైనీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్‌ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది. హరియాణా ముఖ్యమంత్రి రెండోసారి సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీయే సీఎంలు హాజరుకానున్నారు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)