Breaking News

ఇండిగో సంక్షోభం: హర్ష్‌ గోయెంకా నో డిలే, నో డైవర్షన్‌ వైరల్‌ వీడియో

Published on Wed, 12/10/2025 - 14:47

భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులు ఇపుడిపుడే ఒక కొలిక్కి వస్తున్నాయి.  అయితే విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్ల నేపథ్యంలో ఇండిగో పై సోషల్‌మీడియాలో అనేక మీమ్స్‌,  కామెడీ పంచ్‌లు తెగ  వైరల్‌ అయ్యాయి. తాజాగా పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఇండిగోను విమర్శిస్తూ వచ్చిన ఒక AI-వ్యంగ్య వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  ప్రస్తుతం ఇది నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

‘‘ఇండిగో కొత్త విమానాలు: ఆలస్యం లేదు, మళ్లింపులు లేవు... చాలా రీజనబుల్‌’’ అనే శీర్షికతో  పోస్ట్‌ అయిన ఈ వీడియోలో ఇండిగో విమానం మాదిరిగా గానే ఒక  ఆటో రిక్షాను మనం  చూడవచ్చు.  పైలట్ల కొరత, ఒక్క డిసెంబర్‌లోనే 2,000 కంటే ఎక్కువ విమానాల రద్దు, తీవ్రమైన కార్యాచరణ  వైఫల్యం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విడియో  రావడం గమనార్హం.  

కాగా భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్‌లో దాదాపు 65 శాతం  వాటా ఉన్న ఇండిగో, పైలట్ల కోసం కొత్త  పనిగంటలు, నైట్‌ డ్యూటీలు వారపు విశ్రాంతి పరిమితులను (FDTL) తీర్చడానికి కార్యాచరణ వనరులను సర్దుబాటు చేయకుండా ఇండిగో తన శీతాకాలపు షెడ్యూల్‌లో రోజువారీ విమానాలను 6శాతం పెంచడంతో సమస్యలు తలెత్తాయి.దీంతో ఊహించనరీతిలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడ్డాడు.  దీనిపై  కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ,  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు చేపట్టింది. దీనిపై  దర్యాప్తునకు ఒక ఉన్నతస్థాయి  కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ఇండిగో దేశీయ షెడ్యూల్‌లో 10శాతం కోత విధించాలని మంగళవారం ఆదేశించింది. గతంలో జారీ చేసిన 5శాతం తగ్గింపుతో పోలిస్తే ఇది రెట్టింపు.

 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)