Breaking News

ఢిల్లీ బాంబుపేలుళ్లకు హమాస్‌తో లింకులు?

Published on Fri, 11/21/2025 - 17:15

ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులో ఉగ్రవాదుల కుట్రకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోని లాకర్లను ఆయుధాలు, ఇతర మందుగుండు సామాగ్రిని భద్రపరిచేందుకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లుగా ఎన్ఐఏ విచారణలో తేలింది. సరిగ్గా గాజాలో హమాస్ ఈ విధంగానే జరిగిందని ఒక వేళ ఈ ఉగ్రవాదులకు హామాస్‌తో లింకులున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది.

ఆసుపత్రులంటే ఎంతో మందికి ప్రాణాలు పోసే దేవాలయాలు. అటువంటి వైద్యశాలలను ఉగ్రవాదులు సంఘ విద్రోహా చర్యలకు కేంద్రస్థానంగా  ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఎర్రకోట బాంబు దాడిలో అరెస్టైన మహమ్మద్ షకీల్ జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తారు. అతను అరెస్టైన అనంతరం షకీల్ విధులు నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఐఏ బలగాలు సోదాలు చేశాయి. ఆ ఆసుపత్రి లాకర్‌లో ఒక ఏకే-47 మిషన్ గన్‌తో పాటు మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. ఈ విషయంపై మరింత లోతుగా ఎన్ఐఏ  విచారణ చేపట్టింది.

దీంతో అనంత్ నాగ్, బారముల్లా, బుడ్గాం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయుధాలు నిల్వ చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ  విచారణలో తేలింది. ఆసుపత్రులలో మారణాయుధాలు దాచిపెడతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ప్రణాళిక గాజాలో హామాస్ చేసిందని దానిని వీరు కాఫీకొట్టారా లేదా ఆ ఉగ్రవాద సంస్థతో ఇక్కడి ఉగ్రవాదులకు సంబంధాలున్నాయా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది  

గాజాలో హమాస్ ఆల్ షిపా అనే ఆసుపత్రి కింద తన స్థావరాన్ని నిర్మించింది. దీనిని ఇజ్రాయిల్ సైన్యాలు గుర్తించగా అందులో పెద్దఎత్తున ఆయుధాలు బయిటపడ్డాయి.ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లోనూ ఉగ్రవాదులు ఆసుపత్రులను ఆయుధాలు దాచడానికి వాడాలని ప్రయత్నించడంతో ఎన్ఐఏ వారి సంబంధాలపై అనుమానం వ్యక్తం చేస్తుంది.

 

#

Tags : 1

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)