Breaking News

హఫీజ్‌ మరో కుట్ర:‘బంగ్లా’ నుంచి భారత్‌పై దాడులు?

Published on Mon, 11/10/2025 - 12:16

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారతదేశంపై దాడులకు  కుట్ర పన్నుతున్నారని, ఇందుకు బంగ్లాదేశ్‌ను కొత్త వేదికగా ఎంచుకున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్  కూడా నిఘావర్తాలకు అందిందని ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.

అక్టోబర్ 30న పాకిస్తాన్‌లోని ఖైర్‌పూర్ తమేవాలిలో జరిగిన ర్యాలీలో సీనియర్ ఎల్‌ఈటీ కమాండర్ సైఫుల్లా సైఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ వీడియోలో ‘హఫీజ్ సయీద్ ఖాళీగా కూర్చోలేదు.. అతను బంగ్లాదేశ్ మార్గంలో భారతదేశంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు’ అని సైఫుల్లా సైఫ్ స్పష్టంగా చెప్పాడు. లష్కర్ ఎ తోయిబా  సభ్యులు ఇప్పటికే తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)లో చురుకుగా ఉన్నారని, భారతదేశానికి (ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా) సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

కాగా సయీద్ ‘జిహాద్’ నెపంతో బంగ్లాదేశ్‌ యువతకు  ఉగ్రవాద శిక్షణ అందించేందుకు ఆ దేశానికి  సైఫుల్లా సైఫ్‌ను పంపాడు. ఈ శిక్షణ కార్యక్రమానికి పిల్లలు హాజరుకావడం విశేషం. కాగా ఒక వీడియోలో సైఫ్ పాకిస్తాన్ సైన్యాన్ని ప్రశంసించాడు. భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, ఇప్పుడు, అమెరికా మనతో ఉందని, బంగ్లాదేశ్ కూడా మళ్లీ పాకిస్తాన్‌కు దగ్గరవుతోందని వ్యాఖ్యానించాడు. ఈ వాదనలు కార్యక్రమానికి హాజరైన ధైర్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. కాగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ దోస్తీతో ఏర్పడబోయే ముప్పుపై భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న చొరబాట్లపై నిఘాను తీవ్రతరం చేశాయి.

ఇది కూడా చదవండి: కాశ్మీర్‌లో కలకలం.. ఉగ్రవాదులతో వైద్యుల దోస్తీ?
 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు