Breaking News

మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత!

Published on Thu, 06/22/2023 - 11:56

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌ నుంచి గుజరాత్‌ వెళుతున్న సూరత్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు దుండగులు ఒక మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. బాధితురాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ దుండగులు బాధితురాలితో పాటు ఆమె బంధువును కూడా రైలు నుంచి కిందకు తోసేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గ్వాలియర్‌లోని బిలౌవా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. జూన్‌ 19న కూలి పనులు చేసుకునే ఒక మహిళ తన బంధువుతో పాటు సూరత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి.. లక్నో మీదుగా గుజరాత్‌లోని సూరత్‌ వెళుతోంది. బాధిత మహిళ జార్ఖండ్‌లోని పాలమూ జిల్లాకు చెందినది. ఆమె ప్రయాణిస్తున్న రైలులోకి గ్వాలియర్‌లో ఐదుగురు పురుషులు ఎక్కారు. వారంతా బాధితురాలు కూర్చున్న సీటు ఎదురుగా కూర్చున్నారు. కొద్దిసేపటి తరువాత వారంతా ఆ మహిళను చూసి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించారు. 

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ దుండగులు ఆమెకు ఫొటోలు తీసే ప్రయత్నం చేశారు. ఆమె వ్యతిరేకించడంతో ఆమెను, ఆమె బంధువుకు కొట్టారు. దీంతో బాధితురాలు, ఆమె బంధువు రైలు బోగీలోని డోర్‌ దగ్గరకు వెళ్లి నిలుచున్నారు. ఇంతలో ఆ దుండగులు వారి దగ్గరకు వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దీనిని ఆమె వ్యతిరేకించడంతో ఆ దుండగులు ఆమెను, ఆమె బంధువును నడుస్తున్న రైలులో నుంచి కిందకు తోసివేశారు. వారు బరౌడీ గ్రామ సమీపంలో పడిపోయారు.

సోమవారం రాత్రంతా బాధితులు రైలు పట్టాల సమీపంలో స్పృహ తప్పిన స్థితిలో పడి ఉన్నారు. మంగళవారం ఉదయం గ్రామస్తులు వారిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత​్రికి తరలించడంతోపాటు, వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: స్నేహితురాలిపై ప్రేమతో అమె.. ’అతని‘గా మారాలనుకుంది.. కానీ..

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు