Breaking News

‘రేటింగ్‌ ఇవ్వండి.. రెట్టింపు సొమ్ము పొందండి’..దిమ్మతిరిగే కొత్త మోసం!

Published on Wed, 06/21/2023 - 09:10

సైబర్‌ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వెబ్‌సైట్లు, ఇతర లింకులకు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇస్తే చాలు మీరు లెక్కించలేనంత ఆదాయం మీ సొంతమవుతుందంటూ ఒక  మోసగాడు సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చాడు. దీనికి విపరీతమైన స్పందన రావడంతో ఆ మోసగాడు చెలరేగిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. 

‘ఇంట్లో కూర్చుని సంపాదించండి’ అంటూ పలు ప్రకటనలు మనకు కనిపిస్తుంటాయి. అయితే వీటిలో చాలావరకూ మోసపూరితమైనవని తేలుతుంటాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ఇటువంటి ఉదంతం వెలుగుచూసింది. గురుగ్రామ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెక్టార్‌ 57 నివాసి సుబ్రత్‌ ఘోష్‌ తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

గత మార్చినెలలో తనకు టెలిగ్రామ్‌ యాప్‌లో ఒక ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన కనిపించిందని  సుబ్రత్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొన్ని వెబ్‌సైట​్‌లకు, లింకులకు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇవ్వడం ద్వారా ప్రతీరోజూ పెద్దమెత్తంలో సొమ్ము పొందవచ్చని దానిలో పేర్కొన్నారని తెలిపాడు. అయితే ఈ ఉద్యోగం చేసేందుకు ముందుగా రూ.10 వేలు చెల్లించాలని దానిలో పేర్కొన్నారన్నాడు. ఈ మేరకు తాను వారు కోరిన మొత్తాన్ని చెల్లించడంతో వారు తనకు 30 లింకులు పంపించి, ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇవ్వాలని కోరారన్నాడు. దీనిని పూర్తి చేశాక తనకు రూ. 18 వేలు పంపారన్నాడు. 

దీంతో తనకు వారిపై నమ్మకం పెరిగిందన్నాడు. అయితే అప్పుడు ఆ మోసగాడు..పెట్టుబడి మొత్తం పెంచితే వర్క్‌ కేటాయింపు కూడా పెరుగుతుందని తెలిపారన్నాడు. దీంతో తాను దఫదఫాలుగా రూ.25,29176 వారికి పెట్టుబడి రూపంలో చెల్లించానన్నాడు. అయితే ఆ మెసగాళ్లు తాను టాస్క్‌ పూర్తి చేసినా, దానిలో తప్పులు ఉన్నాయంటూ సొమ్ము ఇవ్వలేదని తెలిపాడు. పైగా మరో రూ.12 లక్షలు చెల్లించాలని కోరారన్నాడు. దీంతో తాను మోసపోయాననే సంగతి గ్రహించానని బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఇది కూడా చదవండి: క్షణాల్లో చెల్లింపులు చేసే క్యూఆర్‌ కోడ్‌ ఎలా పనిచేస్తుందంటే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)