భార్య విడాకులు కోరిందని.. కొడుకు వీడియో తీస్తుండగానే..

Published on Sun, 08/02/2026 - 09:53

గురుగ్రామ్‌లోని సూరత్ నగర్‌లో ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. భార్య విడాకులు కోరడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తుండగా, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సంజీవ్ యాదవ్ (36) ఓ కంపెనీలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

ఘటన సమయంలో ఇంట్లో అతడి భార్య మన్‌ప్రీత్ కౌర్, ఏడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. సంజీవ్ ఉరివేసుకున్న దృశ్యాలను కుమారుడు మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్తను రక్షించేందుకు మన్‌ప్రీత్ సహాయం కోసం కేకలు వేసిందని, అనంతరం తన కుటుంబ సభ్యులతో పాటు సంజీవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించిందని పోలీసులు చెప్పారు.

అయితే సంజీవ్ కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య విడాకులు కోరడంతో ఇద్దరి మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతుందని.. సంజీవ్ సోదరి కిరణ్ తెలిపారు. తన సోదరుడి మరణంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. సంజీవ్ తండ్రి రామ్‌సేవక్ యాదవ్ కూడా తన కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. తన కుమారుడిని కుట్ర పన్ని హత్య చేసి ఉండవచ్చని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మన్‌ప్రీత్ కౌర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు  చేస్తున్నారు. 

సంజీవ్, మన్‌ప్రీత్‌లు 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గురుగ్రామ్‌లోని డెన్సో కంపెనీలో పనిచేసే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2019లో వారికి కుమారుడు జన్మించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని.. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సబ్‌ ఇన్‌స్పెక్టర్ మహేందర్ సింగ్ తెలిపారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)