Breaking News

నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?

Published on Mon, 02/02/2026 - 16:01

భారతదేశంలో లగ్జరీ స్టేటస్ సింబల్స్‌ చాలా ఉన్నాయి. వీటి గురించి ఔరా అనిపించే కథనాలు కూడా గతంలో చాలా విన్నాం కూడా. ముఖ్యంగా ఇండియాలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఖర్చు చేయడం ఒక విలాసం మాత్రమే కాదు. ఒక స్టేటస్ సింబల్. ఇపుడొక వ్యక్తి కేవలం ఒక నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. అత్యంత ఖరీదైన డీల్‌గా చరిత్ర సృష్టించిన దీని వివరాలు తెలుసుకుందామా.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నివాసి కిరణ్ కోల్పాకుల సంచలనం క్రియేట్‌ చేశారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో తన వాహన నెంబర్ ప్లేట్ కోసం ఒకటీ రెండూ కాదు రూ.2.08 కోట్లు  వెచ్చించారు.

బిగ్ బాయ్ టాయ్జ్ (BBT) వేలం యాప్ ద్వారా ‘DDC 0001’ అనే ఐడెంటిఫైయర్ ఉన్న వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ రూ. 2.08 కోట్లకు  బిడ్‌ అయింది.  ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు అదుకే ఈ నంబర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు పోటీ పడ్డారు. ఎట్టకేలకు కిరణ్  వింటేజ్ నంబర్ ప్లేట్‌ను ఏకంగా రూ.2.08 కోట్లకు వేలంలో దక్కించు కున్నారు  ఇది దేశంలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా నిలిచింది. ఈ వేలం ప్రధానంగా లగ్జరీ ప్రీ-ఓన్డ్ కార్లకు ప్రసిద్ధి చెందిన బిగ్ బాయ్ టాయ్స్‌కుప్రత్యేకంగా నిలిచింది.అలాగే అరుదైన వస్తువులను సేకరించేవారు ఎంత ధరకైనా వెనకాడరని ఈ డీల్ నిరూపించింది.

ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?

DDC 0001 ప్లేట్‌ను మొదట  తొలి ఓనర్‌, కంపెనీ వ్యవస్థాపకుడు జతిన్ అహుజా. బిగ్ బాయ్ టాయ్స్ ఇటీవలే తన కొత్త విభాగం ఆక్షన్ హౌస్‎ను లాంచ్‌ చేసింది. ఈ వేదిక ద్వారా అత్యంత అరుదైన, విలాసవంతమైన వస్తువులను వేలం వేస్తుంది. గత సంవత్సరం, రూ.1.17కోట్లకు 'HR 88 B 8888' ప్లేట్ అమ్మకం చివరికి బిడ్డర్ చెల్లించడంలో విఫలమై నందున రద్దైంది. తరువాత దానిని రూ.26.7 లక్షలకు తిరిగి అమ్మారు. ఇపుడిక రూ.2.08 కోట్లకు DDC 0001  వేలం కొత్త రికార్డు సృష్టించింది.

బిగ్ బాయ్ టాయ్స్ ఆక్షన్ హౌస్ కేవలం నంబర్ ప్లేట్లు మాత్రమే కాకుండా, ప్రముఖ సెలబ్రిటీలు వాడిన లగ్జరీ కార్లను కూడా వేలంలో ఉంచింది. ఇందులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టికి చెందిన మెర్సిడెస్ బెంజ్ CLA 200d, క్రికెటర్ దినేష్ కార్తీక్ కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR వంటి కార్లు ఉన్నాయి.
 

ఇదీ చదవండి: బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!


 

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు