Breaking News

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం

Published on Tue, 06/24/2025 - 20:37

గాంధీనగర్‌: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా.. 34 ఎయిరిండియా విమానం ఢీ కొట్టిన బీజే మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌కు చెందిన వారు ఉన్నారని మంగళవారం (జూన్‌ 24న)గుజరాత్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

జూన్ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమానం అహ్మాదాబాద్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ భవనాన్ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో మొతత్తం మరణాల సంఖ్యను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ప్రమాదం తీవ్రతతో ఘటనా స్థలంలో భౌతికకాయాల్ని గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది.

దీంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన డీఎన్‌ఏను ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలతో పోల్చి చూస్తున్నారు. మృతదేహాల్ని వారిక కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. కొన్ని మృతదేహాల డీఎన్‌ఏ గుర్తింపు ఇంకా పురోగతిలో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.  

భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదం
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ప్రమాదం భారత విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. జూన్ 12న, లండన్‌కు బయలుదేరిన AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.

ప్రమాదం ఎలా జరిగింది?
- విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే పైలట్ మేడే కాల్ ఇచ్చారు.
- విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా 475 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.
- విమానం మేఘాణి నగర్‌ ప్రాంతంలోని జనావాసాలపై కూలి, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను ఢీకొట్టింది.
- ప్రమాద సమయంలో విమానంలో 241 మంది ప్రయాణికులు ఉండగా, నేలపై ఉన్న 34 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

కారణాలు ఏమిటి?
- ప్రాథమికంగా హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం అనుమానంగా భావిస్తున్నారు.
- బోయింగ్ 787-8 మోడల్ గతంలోనూ సాంకేతిక లోపాలతో వార్తల్లో నిలిచింది
- బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషణ జరుపుతున్నారు.

ఒకే ఒక్కడు ఎలా బతికాడు?
విశ్వకుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కూలిన సమయంలో అతని సీటు విరిగిపడి బయటకు పడిపోయింది. శిథిలాల మధ్య నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)