Breaking News

‘ఎలిమినేటర్‌’కు గుజరాత్‌

Published on Fri, 01/30/2026 - 22:55

వడోదర: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో గుజరాత్‌ జెయింట్స్‌ ‘ఎలిమినేటర్‌’కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ 11 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. లీగ్‌ చరిత్రలో ముంబైతో తలపడిన ఎనిమిది సార్లూ ఓటమి చవి చూసిన గుజరాత్‌ 9వ ప్రయత్నంలో తొలిసారి గెలుపు రుచి చూసింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచి, 3 ఓడిన గుజరాత్‌ 10 పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. 

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. యాష్లీ గార్డ్‌నర్‌ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జార్జ్‌ వేర్‌హామ్‌ (26 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించగా... అనుష్క శర్మ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌), సోఫీ డివైన్‌ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) రాణించారు. 

అమేలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (48 బంతుల్లో 82 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివరి వరకు పోరాడినా... విజయం మాత్రం దక్కలేదు. ఆఖరి 2 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సి ఉండగా, హర్మన్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 24 పరుగులు రాబట్టగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓడినా... ఎలిమినేటర్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ముంబైకి ఇంకా ఉన్నాయి. 

నేడు విశ్రాంతి దినం. ఆదివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కచి్చతంగా గెలవడంతోపాటు రన్‌రేట్‌లో ప్రస్తుతం తమకంటే (–0.164) ఎంతో ముందున్న ముంబైను (+0.059) కూడా దాటాల్సి ఉంటుంది.   

స్కోరు వివరాలు  
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) సజన (బి) షబ్నిమ్‌ 5; సోఫీ డివైన్‌ (సి) కెర్‌ (బి) సివర్‌ బ్రంట్‌ 25; అనుష్క (సి) షబ్నిమ్‌ (బి) కెర్‌ 33; గార్డ్‌నర్‌ (స్టంప్డ్‌) ఫిర్దోస్‌ (బి) కెర్‌ 46; వేర్‌హామ్‌ (నాటౌట్‌) 44; భారతి (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–21, 2–69, 3–71, 4–142. బౌలింగ్‌: షబి్నమ్‌ 4–0–29–1, సివర్‌ బ్రంట్‌ 4–0–36–1, వైష్ణవి 2–0–21–0, అమన్‌జోత్‌ 2–0–13–0, అమేలియా కెర్‌ 4–0–26–2, మాథ్యూస్‌ 4–0–40–0.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సజన (సి) భారతి (బి) కాశ్వీ 26; మాథ్యూస్‌ (బి) డివైన్‌ 6; సివర్‌ బ్రంట్‌ (సి) అనుష్క (బి) డివైన్‌ 2; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 82; అమేలియా కెర్‌ (సి) మూనీ (బి) వేర్‌హామ్‌ 20; అమన్‌జోత్‌ (స్టంప్డ్‌) మూనీ (బి) రాజేశ్వరి 13; సంస్కృతి (ఎల్బీ) (బి) వేర్‌హామ్‌ 0; పూనమ్‌ (సి అండ్‌ బి) గార్డ్‌నర్‌ 2; ఫిర్దోస్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–23, 2–33, 3–37, 4–82, 5–126, 6–127, 7–155. బౌలింగ్‌: రేణుక సింగ్‌ 2–0–11–0, కాశ్వీ గౌతమ్‌ 2–0–12–1, రాజేశ్వరి గైక్వాడ్‌ 4–0–46–1, సోఫీ డివైన్‌ 4–1–23–2, జార్జియా వేర్‌హామ్‌ 4–0–26–2, యాష్లీ గార్డ్‌నర్‌ 3–0–26–1, తనూజ 1–0–11–0. 

#

Tags : 1

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)