Breaking News

గుజరాత్‌లో బీజేపీకి షాక్.. ప్రదీప్‌సిన్హా గుడ్‌ బై..

Published on Sat, 08/05/2023 - 14:52

అహ్మదాబాద్‌: 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో గుజరాత్‌లో బీజేపీ కేంద్ర కార్యనిర్వహణ వర్గాల్లో మార్పులు చేర్పులు చేస‍్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రస్తుతం ఉన్న నాయకుల బలబలాలను అంచనా వేసి, ఉంచాలా? దించాలా? నిర్ణయం తీసుకుంటోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ పరిణామాల అనంతరం..గుజరాత్‌ బీజేపీ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సిన్హా వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. 

రాజీనామా అనంతరం మాట్లాడిన ప్రదీప్ సిన్హా.. మరికొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని అన్నారు. అయితే.. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తున్న సీఆర్‌ పాటిల్‌  పదవికే  ప్రదీప్‌ సిన్హ గురిపెట్టాడనే ఆరోపణలు వచ్చిన తర్వాత తాజాగా ఈ పరిణామాలు జరిగాయి. తాజాగా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపిన ప్రదీప్ .. ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

రాష్ట్ర బీజేపీ పార్టీకి జనరల్ సెక్రటరీగా ప్రదీప్ సిన్హ వాఘేలా 2016 ఆగష్టు 10న బాధ్యతలు చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చాకు ఆయన అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల సమరం దగ్గరపడుతున్న నేపథ్యంలోనే వాఘేలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ 'మహా జన్ సంపర్క్ అభియాన్' అనే కార్యక్రమాన్ని కూడా ఇటీవల చెప్పటింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో ప్రముఖులు, మేధావులు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో దాదాపు 26 లోక్ సభ స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ర్యాలీలను నిర్వహించింది. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణ వర్గాల్లో భారీ మార్పులే చేసింది. 

ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్.. బీహార్ నుండి స్పెషల్ మటన్ తెప్పించి..

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)