Breaking News

దేశంలో భారీ ఉగ్రకుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు

Published on Sun, 11/09/2025 - 15:03

ఢిల్లీ: దేశంలో భారీ ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. ఆదివారం అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌ గూఢాచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలను గమనిస్తున్నామని, తాజాగా ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారిని పట్టుకున్నట్లు ఏటీఎస్‌ వెల్లడించింది.

దేశంలో ఉగ్రకుట్రకు పాల్పడేలా ఈ ఉగ్రవాదులు ఆయుధాల్ని మార్పిడి చేసేందుకు గుజరాత్‌కు వచ్చారు. గుజరాత్‌ కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయుధాల్ని సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. సరఫరా అనంతరం ఉగ్రకుట్ర చేసేలా ప్లాన్‌ చేసేందుకు యత్నించారు. ఆ ప‍్రయత్నాల్లో ఉండగా.. ఏటీఎస్‌ ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అనంతరం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో ఉగ్రమూకలు లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల్ని, వ్యక్తులు గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు ఏటీఎస్‌ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్ ATS ఉగ్రవాద సంస్థ అల్-ఖైదాకు చెందిన ఐదుగురు సభ్యులను అరెస్టు చేసింది. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన మహిళ కాగా, ఆమె పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలున్న ఆన్‌లైన్ టెర్రర్ మాడ్యూల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూలై 22న ఫర్దిన్ షేక్, సైఫుల్లా ఖురేషి, మొహమ్మద్ ఫైక్, జీషన్ అలీ అనే నిందితులను అల్-ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్ భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. జీషన్ అలీ వద్ద నుండి అక్రమ సెమీ ఆటోమేటిక్ పిస్టల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా నోయిడాలోని జీషన్ అలీ నివాసంలో ఏటీఎస్‌ ఆపరేషన్‌ నిర్వహించి మరిన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ముగ్గురు ఉగ్రమూకల్ని అరెస్ట్‌ చేసింది. ఈ ముగ్గురు దేశంలో హింసను ప్రేరేపించడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడం, ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక చర్యలను ప్రోత్సహించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)