Breaking News

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

Published on Mon, 11/09/2026 - 12:02

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి కాలుష్యాన్ని తగ్గించేందుకు అనుమతించిన గ్రీన్ క్రాకర్స్ కూడా పెద్దగా ఉపశమనం కలిగించలేకపోయాయి. టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతించింది. అయితే ఈ నిబంధనలను పట్టించుకోకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీగా టపాసులు కాల్చారు. దీంతో ఇప్పటికే తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ నగరంలో పరిస్థితి మరింత దిగజారింది.

సాధారణ టపాసులతో పోలిస్తే గ్రీన్ క్రాకర్స్ వల్ల కాలుష్యం 30 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇవి పూర్తిగా కాలుష్యరహితమైనవి కావని స్పష్టం చేస్తున్నారు. దీపావళికి ముందు రోజే నగరంలో సల్ఫర్ డయాక్సైడ్ స్థాయులు సుమారు 40 శాతం పెరిగినట్లు పర్యావరణ నిపుణుడు సునీల్ దహియా వెల్లడించారు.

దీపావళి రాత్రి ఒంటిగంట సమయంలో పీఎం2.5 స్థాయులు ప్రతి క్యూబిక్ మీటరుకు దాదాపు 600 మైక్రోగ్రాములకు చేరినట్లు తెలిపారు. ఇది 24 గంటల ప్రమాణం కంటే పది రెట్లు ఎక్కువ. రాత్రి 10 గంటల తర్వాతే సల్ఫర్ డయాక్సైడ్ స్థాయులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.

మరోవైపు గ్రీన్ క్రాకర్స్ పేరుతో సాధారణ టపాసులు మార్కెట్లోకి వస్తున్నాయని ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ ముఖేష్ ఖరే తెలిపారు. వాటి విక్రయాలు, వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదన్నారు. టపాసుల పెట్టెలపై క్యూఆర్ కోడ్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలు కూడా సమర్థంగా అమలుకావడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో టపాసులకు అనుమతులు ఇవ్వడంపై ఢిల్లీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ అయినా, సాధారణ టపాసులైనా గాలి నాణ్యతపై ప్రభావం చూపుతాయని పర్యావరణ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. 

ఇదీ చదవండి: సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)