Breaking News

తెలుగు పోలీసు అధికారికి గుజరాత్‌లో అరుదైన గౌరవం

Published on Mon, 08/07/2023 - 13:40

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి చెందిన వాసం శెట్టి రవితేజ పోలీసు విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ, అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఎస్పీగా పనిచేసిన రవితేజ ఇటీవలే గాంధీనగర్‌కు బదిలీ అయ్యారు. 

పోలీసు అధికారి రవితేజకు జునాగఢ్ వాసులు ఎంతో భిన్నంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమం పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ముందుగా పూలతో అలంకరించిన కారులో అధికారి రవితేజను కూర్చోబెట్టారు. పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి పోలీసు కాన్వాయ్ జునాగఢ్ వీధుల గుండా ముందుకు సాగింది. ఈ సమయంలో జునాగఢ్ ప్రజలు పోలీసు సూపరింటెండెంట్‌కు రహదారి మార్గంలో అపూర్వరీతిలో వీడ్కోలు పలికారు. 

2015 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రవితేజ జునాగఢ్‌ ఎస్పీగా మూడేళ్లు సేవలు అందించారు. 2019లో జునాగఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. తాజాగా జునాగఢ్‌ నుంచి గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు. గాంధీనగర్‌ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆయనపై స్థానికులు పూలవర్షం కురిపిస్తూ, అపూర్వ స్వాగతం పలికారు. రవితేజ పోలీసు విభాగంలో అందించిన  సేవలకు గుర్తుగా అప్పటి డిప్యూటీ సీఎం నవీన్‌ పటేల్‌ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి గుజరాత్‌లో ఇంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించడంపై కోనసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్‌ మరో వింత వ్యాఖ్యానం!

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు