Breaking News

Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్‌

Published on Mon, 09/23/2024 - 08:46

లక్నో: యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీపావళికి ముందుగానే ఉద్యోగులకు డీఏ, బోనస్‌లను అందించనున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలోని దాదాపు  ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు దీపావళి బోనస్‌తో ప్రయోజనం పొందనున్నారు. అలాగే 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు పరిధిలోకి రానున్నారు. డీఏను 50 శాతం నుంచి 54 శాతానికి పెంచనున్నారు. దీని ప్రయోజనాలు జూలై నెల నుంచి లెక్కించనున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బోనస్‌గా రూ.7 వేలు వరకూ అందుకున్నారు.

మరోవైపు డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచుతున్నప్పుడల్లా రాష్ట్ర సర్కారు కూడా ఈ పెంపుదలని అమలు చేస్తూవస్తోంది. ఈ పెంపుపై త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. 
 

ఇది కూడా చదవండి: డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)