Breaking News

దేశంలోకి రెండేళ్లలో రూ.800 కోట్ల దొంగ బంగారం

Published on Wed, 09/10/2025 - 03:35

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) ద్వారా గడిచిన రెండేళ్ల కాలంలో కనీసం టన్ను బరువైన రూ.800 కోట్ల బంగారంలో దేశంలోకి దొంగచాటుగా వచ్చింది. 2023, 2024 సంవత్సరాల్లో టిబెటన్లు, చైనీయులే ఈ బంగారాన్ని స్మగ్లింగ్‌ చేశారు. గతేడాది జూలైలో లద్దాఖ్‌లో ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) దళం 108 కిలోల విదేశీ బంగారం కడ్డీలను పట్టుకున్న నేపథ్యంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు మంగళవారం ఈడీ వర్గాలు తెలిపాయి.

చైనాతో మనకున్న 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్‌ఏసీ రక్షణ బాధ్యతలను ఐటీబీపీయే చూసుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఐదు ప్రాంతాలు, లద్దాఖ్‌లో ఒక చోట మంగళవారం తనిఖీలు చేపట్టామని ఈడీ వివరించింది. దొంగతనంగా తీసుకువచ్చిన బంగారానికి సంబంధించిన చెల్లింపులన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారానే పూర్తయినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) తెలిపింది. పట్టుబడిన 108 కిలోల విదేశీ బంగారాన్ని చైనాకు చెందిన భు చుమ్‌చుమ్‌ అనే వ్యక్తి భారత్‌లోని టెండు తాషికి ఎల్‌ఏసీ ద్వారా పంపాడని డీఆర్‌ఐ వివరించింది. ఇందుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నామంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)