Breaking News

బంగారు పూత కలశం చోరీ

Published on Mon, 10/13/2025 - 06:14

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్‌ ప్రాంతంలో జైన దేవాలయం గోపురం నుండి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు పూత కలశం చోరీ అయ్యింది. ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైన చోరీకి సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలివి. జ్యోతి నగర్‌ ప్రాంత నివాసితులు శుక్రవారం అర్ధరాత్రి భారీ ఎత్తున కర్వా చౌత్‌ వేడుకల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు విద్యుత్తీగల ఆధారంగా ఆలయం పైకప్పు ఎక్కి, గోపురం పైకి చేరుకున్నాడు. అక్కడున్న బంగారు పూత కలశాన్ని చోరీ చేసి పారిపోయాడు. 

అష్ట ధాతువులతో కలశం తయారీ 
చోరీ అయిన కలశం ’అష్ట ధాతువులు’ (ఎనిమిది లోహాల మిశ్రమం)తో తయారైంది. దీని తయారీకి సుమారు 200 గ్రాముల బంగారం వినియోగించారు. కలశం విలువ సుమారు రూ.35–40 లక్షలు ఉంటుందని అంచనా. కలశం సుమారు 25 నుండి 30 కిలోగ్రాముల రాగి, బంగారు పూతతో తయారైందని పోలీసులు 
తెలిపారు. చోరీపై ఆలయ కమిటీ అధ్యక్షుడు నీరజ్‌ జైన్‌ శనివారం ఉదయం ఈస్ట్‌ జ్యోతి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు బృందాలను ఏర్పాటు చేశామని, అతని కదలికలను తెలుసుకోవడానికి సాంకేతిక నిఘా ఉపయోగిస్తున్నామని పోలీసులు తెలిపారు.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)