Breaking News

అసంతృప్త యువతరం

Published on Thu, 09/18/2025 - 04:51

యువతరం అనగానే ఉరిమే ఉత్సాహం, నిత్య చైతన్యం నిండిన ముఖాలే గుర్తుకొస్తాయి. సాధారణంగా జీవితంలో అసంతృప్తి దశ అంటే మధ్య వయసు అని ఎన్నాళ్లుగానో ఒక నమ్మకం బలపడిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. మధ్య వయస్కులకంటే జనరేషన్‌–జెడ్‌ (1996–2010 మధ్య పుట్టిన వారు)గా పిలుస్తున్న యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. 

భవిష్యత్తుపై అనిశ్చితి, సోషల్‌ మీడియా ప్రభావం, కోవిడ్‌–19 తర్వాత వచ్చిన మార్పులు తదితర పరిణామాలతో యువతలో అసంతృప్తి అధికంగా ఉందని 44 దేశాల్లో దీర్ఘకాలంపాటు నిర్వహించిన గ్లోబల్‌ సర్వేలో తేలింది. డేవిడ్‌ జి.బ్లాంచ్‌ఫ్లవర్, అలెక్స్‌ బ్రైసన్, జియావోయ్‌ జు అనే శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయన నిర్వహించింది. 2024 వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌ వంటి పరిశోధనలను బట్టి చూస్తే మధ్య వయస్కులలోనే అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. 

కానీ, ఈ సంప్రదాయ సూత్రీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు అని ఈ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. దశాబ్దాలుగా పరిశోధకులు ‘మిడ్‌ లైఫ్‌ అన్‌హ్యాపినెస్‌ హంప్‌’ను ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. 

కానీ, ఇప్పుడు యువతలో.. అదీ కూడా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో ఈ ధోరణి అధికంగా ఉందని గుర్తించారు. ఇందుకు సోషల్‌ మీడియా, ఆర్థిక అస్థిరత, కోవిడ్‌–19 దీర్ఘకాలిక ప్రభావాలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిర పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటివి కారణమని తేల్చారు.  

స్కీ స్లోప్‌లోకిజెన్‌ జెడ్‌
అధిక ఆదాయ దేశాల్లోని (హై ఇన్‌కమ్‌ కంట్రీస్‌)యువతలో అసంతృప్తి స్థాయి అధికంగా ఉంది. విభిన్న నేపథ్యాలున్న దేశాల్లోనూ ఈ పరిస్థితి పెరుగుతోంది.జెన్‌– జెడ్‌ అసంతృప్తిలో ‘స్కీ స్లోప్‌’ను అంటే.. పల్లంలోకి జారుకునే స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతర అధ్యయనాల్లోని డేటా కూడా ఈ ధోరణిని సమరి్థస్తోంది. మానసికఆందోళన, ఒత్తిళ్లు, కుంగుబాటు అనేవి 16–19 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లు, 20–24 ఏళ్ల మధ్య వయసులోని యువతలో అధికంగా ఉన్నట్టు తేలింది. గత పదేళ్లుగా యువతరం మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఈ బృందం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు.  

ఐక్యరాజ్య సమితి సీడీసీ నివేదికలోని అంశాలు..
» యువకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు 1993లో 2.5% ఉండగా, 2024లో 6.6%కి పెరిగాయి. 
» యువతుల్లో ఇదే కాలంలో 3.2% నుంచి 9.3%కి చేరింది. 
» 2023 గ్యాలప్‌ సర్వేలో జెన్‌ జెడ్‌లో 15% మంది తమ మానసిక ఆరోగ్యం బాగా ఉందని తెలిపారు.  
» 1981–1996ల మధ్య జని్మంచిన 52% మిలీనియల్స్‌ (మధ్య వయసువారు) మానసిక ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.

సమస్యలకు కారణాలు.. 
» సోషల్‌ మీడియా అధిక వినియోగంతో అవాస్తవిక సామాజిక పోలికలు ఏర్పడి ఆందోళన, అసంతప్తి పెరుగుతోంది. జెన్‌ జెడ్‌ ఎక్కువగా ఆర్థిక ఆందోళన, అస్థిరతను ఎదుర్కొంటున్నారు.  
»   కోవిడ్‌–19 వల్ల సామాజిక, విద్యా జీవితానికి ఏర్పడిన అంతరాయాలు యువత మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.  
»  రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పులపై అవగాహన పెరగడం యువతలో నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి భావాలకు దారితీస్తోంది.

పరిష్కారాలు..
» యువతలో సంతోషాలు నింపేందుకు వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని మెరుగుపర్చాలి. పాఠశాలల్లో ఫోన్‌ వాడకాన్ని నిషేధించాలి. 
»  మెంటల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ను పెంచాలి. 
» కౌమార దశ నుంచి వయోజనులుగా మారుతున్న క్రమంలో యువతకు సంబంధించి స్కూళ్ల విధానాలను నవీకరించడంతోపాటు డిజిటల్‌–సేఫ్టీ చర్యలు చేపట్టాలి. 
» సోషల్‌ మీడియా వినియోగాన్ని తగ్గించి, చుట్టూ ఉన్నవారితో ప్రత్యక్ష సంబంధాలను ప్రోత్సహించాలి.  
» స్నేహితులతో అధిక సమయం గడపడం ద్వారా యువతలో ఆనందాన్ని మెరుగుపర్చవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.

- సాక్షి, హైదరాబాద్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)