Breaking News

దారుణం: శస్త్ర చికిత్స చేసినట్లు చేసి..అవయవాలు దొంగలించారు

Published on Wed, 02/01/2023 - 12:22

శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ఓ బాలిక శరీరంలో ఏకంగా అవయవాలనే తొలగించేశారు వైద్యులు. దీంతో సదరు బాలిక డిశ్చార్జ్‌ అయ్యి వెళ్లిన రెండు రోజులకే చనిపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలిక పేగు సంబంధిత వ్యాధితో జనవరి 21న అడ్మిట్‌ అయ్యింది. దీంతో ఆమెకు జనవరి 24న శస్త్ర చికిత్స చేశారు. చికిత్స చేసిన అనంతరం రెండు రోజుల తర్వాత అంటే జనవరి 26న ఆమె చనిపోయింది.

తొలుత బాలిక కుటుంబ సభ్యులు సదరు ఆస్పత్రిపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు. అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఆమె మృతదేహంపై చిల్లులు చిల్లులుగా ఉండి ఏవో సంచులుగా కనిపించాయి. అప్పుడే అనుమానం వచ్చింది మృతదేహం నుంచి అవయవాలు తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్‌ సంచులు ఉంచినట్లు అనిపించి వెంటనే వారు ఆ కార్యక్రమాలను నిలిపేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్‌కి సంబంధించిన కేసుగా నమోదు చేశారు. ఆ బాలికకు శస్త్ర చికిత్స చేసిన హిందూ రావు ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురుతేగ్‌ బహుదూర్‌ ఆస్పత్రి వద్ద ఉంచారు. ఆ బాలికకు పోస్ట్‌మార్టం చేసేందుకు ప్రత్యేక మెడికల్‌ బోర్డును నియమించాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు డీసీపీ కల్సి ఈ కేసును పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

(చదవండి: ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే: ఉత్తరాఖండ్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు)

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు