‘త్వరలో రాహుల్‌ పెళ్లి.. స్వీట్స్‌కు ఆర్డర్‌’?.. సంబరంగా చెప్పిన దుకాణదారు

Published on Tue, 10/21/2025 - 10:45

న్యూఢ్లిలీ: దేశమంతటా దీపావళి వేడుకలు ఎంతో ఆనందంగా జరిగాయి. ఈ సందర్భంగా చాలామంది పరస్పరం స్వీట్లను పంచుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది. దీపావళి వేళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముందుకు మరోమారు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక మిఠాయి దుకాణం యజమాని  ఆ వివరాలు వెల్లడించారు.

దీపావళి వేళ ఓల్డ్ ఢిల్లీలోని ప్రముఖ ఘంటేవాలా స్వీట్స్‌ దుకాణానికి మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‌తో జరిగిన సంభాషణను యజమాని సుశాంత్ జైన్  మీడియాకు తెలిపారు. ముందుగా ఆయన రాహుల్ గాంధీని భారతదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అభివర్ణించారు. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, తనకు అతని వివాహ స్వీట్ల ఆర్డర్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  తమ దుకాణానికి ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబంతో అనుబంధం ఉందని, వారికి స్వీట్లు కావాల్సినప్పుడు తామే అందిస్తామని తెలిపారు.
 

రాహుల్‌ తమ దుకాణానికి రాగానే తాను.. ‘రాహుల్ జీ.. దయచేసి త్వరలోనే పెళ్లి చేసుకోండి. మీ వివాహ స్వీట్ల ఆర్డర్  కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని’ అన్నానని తెలిపారు. రాహుల్‌​ తమ దుకాణంలోకి వచ్చిక అతని తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్‌ను గుర్తుచేసుకుంటూ, అతనికి ‘ఇమారి’ స్వీట్‌ ఇష్టమని చెప్పారన్నారు. అలాగే ఆయన దానిని తయారు చేసేందుకు ప్రయత్నించారన్నారు. రాహుల్‌కు బేసన్‌ లడ్డూ ఇష్టమని తెలుసుకున్న తాను.. అతనితో దానిని కూడా తయారు చేసేందుకు కూడా ప్రయత్నించమని చెప్పానని సుశాంత్ జైన్ తెలిపారు.

దుకాణానికి వచ్చిన రాహుల్‌ అక్కడి సిబ్బంది ఆప్యాయంగా పలుకరించారు. పండుగను ఎలా చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు. ‘పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ దుకాణంలో ఇమార్తి, బేసన్ లడ్డూలు తయారుచేశాను. ఈ షాపులోని శతాబ్దాల నాటి  తీపిదనం ఇప్పటికీ  మనసుకు హత్తుకునేలా ఉంది. అసలైన దీపావళి గొప్పదనం స్వీట్లలోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది" అని రాహుల్ రాశారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)