Breaking News

దేశంలో తొలి సామూహిక గణేశ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతకుముందు ఏం జరిగింది?

Published on Tue, 09/26/2023 - 10:57

మన దేశంలో ప్రస్తుతం అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారి గణేష్ ఉత్సవాల బహిరంగ వేడుకలు ఎప్పుడు జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఆ ఉత్సవాలకు ఎవరు సారధ్యం వహించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

దేశంలో తొలిసారిగా 1893లో మహారాష్ట్రలోని పూణేలో గణేశ్‌  ఉత్సవాలు బహిరంగంగా ప్రారంభమయ్యాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుండి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇది మతపరమైన పండుగే అయినా నాటికాలంలో స్వాతంత్ర్య పోరాట బలాన్ని పెంచడానికి, స్వాతంత్ర్యంపై అవగాహనను పెంపొందించడానికి, కులతత్వం, అంటరానితనాన్ని రూపుమాపడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడింది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కూడా గణేశ్‌ ఉత్సవాల నిర్వహణకు హిందువులకు మద్దతుగా నిలుస్తుంటారు.

1893వ సంవత్సరానికి ముందు గణేష్ ఉత్సవాలను ప్రైవేట్‌గా లేదా చిన్న స్థాయిలో జరుపుకునేవారు. బ్రిటీష్ బానిసత్వం, మొఘల్‌లతో సహా ఇతర విదేశీ ఆక్రమణదారుల అణచివేత మొదలైనవి దీని వెనుకగల కారణాలని చెబుతుంటారు. హిందువులు నాటిరోజుల్లో తమ ఇళ్లలోనే గణపతిని పూజించేవారు. స్వాతంత్య్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేశ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు. నిమజ్జనం సందర్భంగా గణపతి పందాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్‌ శాంతియుత ఆయుధంగా మలచుకున్నారు. 

నాటి రోజుల్లో స్వరాజ్యం కోసం లోకమాన్య తిలక్ ఐక్యతా సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నారు. ఇందుకోసం ఆయన గణపతి ఉత్సవాలను ప్రజా వేదికగా ఎంచుకున్నారు. తిలక్ ప్రారంభించిన గణేశ్‌ ఉత్సవాలు గజాననుని జాతీయ సమైక్యతకు చిహ్నంగా మార్చివేశాయి. పూణే తర్వాత మహారాష్ట్ర అంతటా జరిగిన గణేశ్‌ ఉత్సవాలు ఆ తర్వాత దేశ విదేశాలకు సైతం వ్యాపించాయి. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజా ఐక్యతకు గణేశ్‌ ఉత్సవాలు దోహదపడ్డాయి.
ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్‌ ఏమిటి?

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)