Breaking News

‘ఏఐ సమ్మిట్’లో ‘చైనా డాగ్‌’ లొల్లి.. స్టాల్‌ తొలగింపు!

Published on Wed, 02/18/2026 - 09:53

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ప్రదర్శించిన ఒక రోబో డాగ్‌ విషయమై వివాదం తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రదర్శించిన ఆ రోబో డాగ్ ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన యూనిట్రీ (Unitree) సంస్థ తయారు చేసిన రోబోను తామే తయారు చేశామని యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొనడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ తీరును తప్పుబడుతూ పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గల్గోటియా యూనివ‌ర్శిటీ  స్టాల్‌కు క‌రెంట్ క‌ట్‌చేసిన నిర్వాహాకులు వెంటనే దానిని ఖాళీ చేయించారు. చైనా రోబోను భార‌త్‌ రోబోగా చెప్పుకోవడాన్ని చైనా మీడియా తప్పుబట్టింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. ఈ రోబో పేరు ‘ఓరియన్’ (Orion) అని, దీనిని గల్గోటియాస్ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రూపొందించిందని నేహా సింగ్ ఒక వీడియోలో పేర్కొన్నారు. ఇది నిఘా, పర్యవేక్షణ పనులను సమర్థవంతంగా చేయగలదని, క్యాంపస్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతుందని ఆమె వివరించారు. అయితే, వీడియో చూసిన నెటిజన్లు అది చైనా కంపెనీ యూనిట్రీకి చెందిన రోబోగా గుర్తించి, యూనివర్శిటీ సొంతంగా తయారు చేసిందన్న వాదనను తప్పుబడుతున్నారు.
 

సోషల్ మీడియాలో చైనా రోబో డాగ్‌ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ ఎట్టకేలకు దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ రోబోను తాము తయారు చేయలేదని, అలాగే తాము రూపొందించినట్లు ఎక్కడా చెప్పలేదని యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మేము ఈ రోబోను తయారు చేయలేదు. అయితే భవిష్యత్తులో భారత్‌లోనే ఇలాంటి సాంకేతికతను రూపొందించేలా మా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం’ అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పించేందుకే చైనా, సింగపూర్, అమెరికా వంటి దేశాల నుండి పరికరాలను తెప్పిస్తున్నట్లు వెల్లడించింది.

చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ ‘యూనిట్రీ’ ఈ క్వాడ్రపెడ్ (నాలుగు కాళ్ల) రోబోలను తయారు చేస్తుంది. జంతువుల కదలికలను పోలి ఉండే ఈ రోబోలు అడ్డంకులను అధిగమించడంలో, వివిధ తనిఖీల్లో వినోద రంగంలో  ఉపయోగపడుతున్నాయి. బోస్టన్ డైనమిక్స్ వంటి సంస్థల రోబోలతో పోలిస్తే, యూనిట్రీ రోబోలు తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండటం విశేషం.

ఇది కూడా చదవండి: ‘నేషనల్ ఏఐ ప్లాన్‌’తో దూకుడు..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)