Breaking News

చైనా రోబో డాగ్‌ వివాదం.. ప్రొఫెసర్‌ నేహా సింగ్‌ ఉద్యోగానికి ఎసరు!

Published on Wed, 02/18/2026 - 20:10

ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో చైనా రోబోడాగ్‌ వివాదంలో అబాసుపాలైన ప్రైవేట్‌ యూనివర్సిటీ గల్గోటియాస్‌ యూనివర్సిటీ వివాదంలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. చైనా రోబో డాగ్‌ తామే తయారు చేశామని ప్రచారం చేసుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నేహాసింగ్‌ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. 

భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ ఇపాక్ట్‌ సదస్సును నిర్వహిస్తోంది. అయితే, ఈసదస్సులో గ్రేటర్‌ నోయిడాకు చెందిన ప్రైవేట్‌ యూనివర్సిటీ గల్గోటియాస్‌ ప్రతినిధులు  అత్యుత్సాహం ప్రదర్శించారు. అదికాస్తా వివాదం కావడంతో సదస్సు నుంచి గెంటివేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

చైనా రోబోటిక్‌ కంపెనీ యూనిట్రీ తయారు చేసింది. యూనిట్రీ జీవో2 పేరిట విక్రయిస్తోంది. ఆ రోబోట్‌ను తామే తయారు చేశామని గల్గోటియాస్‌ యూనివర్సిటీ  ప్రొఫెసర్‌ నేహాసింగ్‌ డీడీ న్యూస్‌తో మాట్లాడారు. యూనివర్సిటీలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో రోబోడాగ్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు.ఓరియన్ (orion) అనే పేరు పెట్టామని దానిని ప్రదర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడిన తీరు, ప్రదర్శనకు ఉంచిన రోబోటిక్‌ డాగ్‌ వీడియోలు వైరల్‌గా మారాయి. 

అయితే, ఆ వీడియోల్లో చైనా రోబోటిక్‌ కంపెనీ యూనిట్రీ తయారు చేసిన యూనిట్రీ జోవో2 రోబోటిక్‌ డాగ్‌గా గుర్తించారు. అందుకు కారణంగా ప్రపంచ దేశాల్లో ఆ సంస్థ రోబోటిక్‌ డాగ్‌లను పలు కార్యాక్రమాల్లో విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఏఐ ఇంపాక్ట్‌ నిర్వహిస్తున్న కేంద్ర ఐటీ శాఖ విభాగం ప్రతినిధులు సైతం స్పందించారు. వెంటనే సదస్సును ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ ప్రతినిధులు సదస్సును ఖాళీ చేశారు. 

ఈ క్రమంలో ఏఐ సదస్సులో జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతూ ఓ నోట్‌ను విడుదల చేసింది. ఆ నోట్‌లో యూనివర్సిటీ గురించి వివాదం తలెత్తడానికి కారణం ప్రొఫెసర్‌ నేహాసింగ్‌ది తప్పు. యూనివర్సిటీ తరుఫున సదస్సులో స్టాల్‌ నిర్వహిస్తున్న మా ప్రతినిధుల్లో ఆమె ఒకరు. సదస్సు గురించి, రోబోటిగ్‌ డాగ్‌ గురించి సరైన సమాచారం లేదు. మీడియాతో మాట్లాడే అధికారం కూడా ఆమెకు లేదు’అని పేర్కొంది.  

ఇదే అంశంపై మీడియా ఆమె వద్ద ప్రస్తావించగా.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, రోబోట్‌ డాగ్‌ను మా యూనివర్సిటీ తయారు చేయలేదని స్పష్టం చేసింది.  

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రపంచ దేశాల్లో యూనివర్సిటీ పరువు పోవడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ప్రొఫెసర్‌ నేహాసింగ్‌ను యూనివర్సిటీ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. లింక్డిన్‌ ప్రొఫెల్‌ సైతం ఆమె మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతుంది. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)