Breaking News

జీ20 సమ్మిట్: ప్రధాని మోదీ నేమ్‌ప్లేట్‌పై 'భారత్' పేరు

Published on Sat, 09/09/2023 - 16:00

ఢిల్లీ:దేశం పేరుమార్పుపై ప్రస్తుతం రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీ20 వేదికలో ప్రధాని నరేంద్ర మోదీ నేమ్‌ప్లేట్‌పై దేశం పేరును భారత్ అనే పేర్కొన్నారు. దీంతో దేశం పేరును మారుస్తున్నారనే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది. 

జీ20 డిన్నర్ మీటింగ్‌కి ఆహ్వానాలు పంపిన క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన జీ20 బుక్‌లెట్‌లోనూ భారత్, మధర్ ఆఫ్ డెమోక్రసీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగానే దేశం అధికారిక పేరు భారత్‌ అని బుక్‌లెట్‌లో స్పష్టం చేశారు. 

రాష్ట్రపతికి పంపిన ఆహ్వాన బుక్‌లెట్‌లో భారత్ అని పేర్కొనడంతో దేశం పేరు మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈనెల 18-23 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నందున.. దేశం పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టనున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు సందించాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఇండియా కూటమి మండిపడింది.

ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది. ఇండియా కూటమిని దేశ వ్యతిరేకుల కూటమిగా అభివర్ణించింది. ఇండియా పేరు వలసవాద స్వభావాన్ని సూచిస్తోందని, భారత్‌ పేరు సరైనదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. 

ఇదీ చదవండి: ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే..


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)