Breaking News

మరిన్ని చిక్కుల్లో కాంగ్రెస్‌ యువ ఎమ్మెల్యే!

Published on Fri, 08/22/2025 - 10:35

కేరళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణల ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు బాధితులమంటూ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా.. హిజ్రా ఒకరు రాహుల్‌పై సంచలన ఆరోపణలకు దిగారు.

తనను అత్యాచారం చేస్తానంటూ పాలక్కడ్‌ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ మెసేజ్‌లు పంపాడంటూ ట్రాన్స్‌ ఉమెన్‌ యాక్టివిస్ట్‌ అవంతిక ఆరోపిస్తోంది. ‘‘త్రిక్కకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్‌ జరుగుతుండగా రాహుల్‌ను కలిశాను. ఆ తర్వాత అతనికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాను. ఆపై అతను రాత్రింబవళు తెగ ఫోన్‌ చేసేవాడు. ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు.

అయితే పోను పోను అతని ప్రవర్తలో మార్పు వచ్చింది. అసభ్యమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ‌ మెసేజ్‌లు‌ పెట్టాడు. భయంతో కాంగ్రెస్‌ నేతలకు నేను ఫిర్యాదుచేశా. కానీ, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆఖరికి నన్ను కూడా వదలకుండా.. రేప్‌లు చేస్తానన్నోడిని రోల్‌ మోడల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా? అని  అవంతిక ప్రశ్నించింది. రాహుల్‌తో జరిగినట్లుగా చెబుతున్న చాటింగ్‌ను ఆమె మీడియా ముందు ప్రదర్శించింది.

రాహుల్ మమ్‌కూటథిల్‌పై మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్‌ ఆరోపణలతో కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగింది. అధికార, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్‌కూటథిల్ గురువారమే రాజీనామా చేశాడు. అయితే.. ఈ ఆరోపణల్లో ఇప్పటివరకు ఎవరూ అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఇదే అంశాన్ని ప్రస్తావించిన రాహుల్‌.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని శపథం చేశాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)