Breaking News

అక్కడ బీజేపీకి ఓటమి.. ఆప్‌, కాంగ్రెస్‌, టీఎంసీ విజయం

Published on Mon, 06/23/2025 - 07:59

Four States Bypoll Results Updates..

👉నాలుగు రాష్ట్రాల్లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పంజాజ్‌లోని లూథియానా స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అభ్యర్థి సంజీవ్‌ అరోరా విజయం సాధించారు. గుజరాత్‌లోని విసావదార్‌ అసెంబ్లీ స్థానంలో ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. 

👉కేరళలోని నీలంబూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్యధాన్‌ శోకత్‌ విజయాన్ని అందుకున్నారు. ఇక, గుజరాత్‌లోని కాడీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్‌ గెలిచారు. బెంగాల్‌లో తృణముల్‌ అభ్యర్థి అలిఫా అహ్మద్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

 ఆప్‌, బీజేపీ, తృణముల్‌, కాంగ్రెస్‌ ఆధిక్యం ఇలా.. 

  • బెంగాల్‌లో తృణముల్‌ అభ్యర్థి భారీ ఆధిక్యం..

పంజాజ్‌లో దూసుకెళ్తున్న ఆప్‌ అభ్యర్థి.

కేరళలో​ కాంగ్రెస్‌ అభ్యర్థ ముందంజ. 

గుజరాత్‌లో పోటాపోటీ.. 

లీడ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ 

  • గుజరాత్‌లో రెండు స్థానాల్లో బీజేపీ ముందంజ..

  • పంజాబ్‌లో ఆప్‌ లీడింగ్‌

  • కేరళలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజ
  • బెంగాల్‌ తృణముల్‌ అభ్యర్థికి లీడ్‌. 

గుజరాత్‌లో ఆప్‌ అభ్యర్థి ముందంజ..

  • విసావదర్ స్థానంలో ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియాకు లీడింగ్‌.
  • రెండో స్థానంలో బీజేపీ 

 

 

👉పంజాబ్‌లో ఆప్‌ అభ్యర్ధి లీడింగ్‌..

 

👉కేరళలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజ..

👉జూన్ 19న ఎన్నికలు జరగ్గా నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్‌లోని రెండు స్థానాలు విసావదర్, కాడి, పంజాబ్ (లూథియానా వెస్ట్), బెంగాల్ (కాలిగంజ్), కేరళ (నిలంబూర్) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.

గుజరాత్‌లో ఇలా.. 
గుజరాత్‌లోని కాదీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాజేంద్రకుమార్‌ దానేశ్వర్‌ చవడా, కాంగ్రెస్‌ అభ్యర్థి రమేష్‌భాయ్‌ చావడ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణం కారణంగా ఉప ఎన్నికల జరగుతోంది. అలాగే, మరో స్థానం విసావదార్‌లో బీజేపీ అభ్యర్థి కిరీట్‌ పటేల్‌, ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా మధ్య హోరాహోరీ ఉండే అవకాశం ఉంది.

 

 కేరళలో.. 
కేరళలోని నీలంబర్ సీటు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ స్థానం ఆమె వయనాడ్ నియోజకవర్గంలోకి వస్తుంది. జూన్ 19న జరిగిన ఉప ఎన్నికలకు ముందు ఆమె ఈ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓవి అన్వర్ గెలుస్తారా లేదా? అనేది తేలనుంది.

బెంగాల్ బైపోల్
నాడియా జిల్లా పరిధిలోకి వచ్చే బెంగాల్‌లోని కలిగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగింది. ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ అధికార పార్టీ అభ్యర్థిగా ఆ స్థానాన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్‌ను నిలబెట్టగా, కాంగ్రెస్ CPI(M) మద్దతుతో కబిల్ ఉద్దీన్ షేక్‌ పోటీలో ఉన్నారుఉ. కలిగంజ్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్, బీజేపీ మధ్య కీలకంగా మారనుంది.

పంజాబ్‌లో త్రిముఖ పోరు.. 
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ స్థానంలో ఆప్‌కు చెందిన సంజీవ్ అరోరా, బీజేపీ జీవన్ గుప్తా, కాంగ్రెస్‌ భరత్ భూషణ్ అషు మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. శిరోమణి అకాలీదళ్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా పరూప్కర్ సింగ్ ఘుమాన్‌ను నిలబెట్టింది.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)