Breaking News

శ్రీనగర్‌ నుంచి  ప్రత్యేక విమానాలు

Published on Thu, 04/24/2025 - 04:34

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాధిత పర్యాటకులు, మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఉగ్రదాడి జరిగిన తర్వాత వెంటనే కేంద్ర హోంమంత్రితో సమన్వయంతో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు చర్యలు చేపట్టి,  శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి రెండు, ముంబైకి రెండు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 

అవసరమైతే మరిన్ని విమానాలను సిద్ధంగా ఉంచేలా కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రయాణికులపై భారం పడరాదన్న ఉద్దేశంతో విమాన ధరలకు రెక్కలకు బ్రేక్‌ వేస్తూ ఏకకాలంలో టికెట్ల ధరలు పెరగకుండా ఉండేందుకు అన్ని ఎయిర్‌లైన్స్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

 ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి, కశ్మీర్‌లో ఉన్న తెలుగు పర్యాటకుల రాకపోకలు సమన్వయం చేసేలా చర్యలు చేపట్టారు. 

అంతేకాకుండా, పహల్గామ్‌ వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి చంద్రమౌళి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడి, మృతదేహాన్ని గౌరవంగా విమానమార్గంలో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల తరలింపునకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎయిర్‌లైన్స్, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నారు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)