Breaking News

సీజేపీకి పాక్ నేతలతో లింకు.. కేంద్రం సంచలన ఆరోపణ!

Published on Thu, 11/05/2026 - 12:20

న్యూఢిల్లీ: ఢిల్లీలో నిరసనలు చేపట్టి రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సంస్థకు విదేశాల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని, అమెరికా దాతలు, పాకిస్థాన్ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది.

అమెరికా నుంచి అభిజీత్ దీప్కేకు నిధులు?
బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు అమెరికాకు చెందిన దాతల నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. ఆ సంస్థ వ్యూహకర్త అశుతోష్ రాంకాకు పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఆర్థిక సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు. విదేశీ నిధులతో పనిచేసే ఎన్జీవోలు, భారత్ వ్యతిరేక శక్తులు కలిసి దేశంలో తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలు బహిరంగంగా వెల్లడికావాల్సి ఉంది.

పండుగల వేళ ఢిల్లీలో అశాంతికి కుట్ర?
బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ ఏ సిన్హా కూడా సీజేపీపై విమర్శలు గుప్పించారు. గత నెల రోజులుగా ఆ సంస్థ చేపట్టిన నిరసనలు దేశ రాజధానిలో అశాంతి సృష్టించేందుకేనని ఆరోపించారు. పండుగల సమయంలో ఢిల్లీలో గందరగోళం సృష్టించాలనే దురుద్దేశంతోనే ఈ నిరసనలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఈ ఉద్యమాన్ని రూపొందించారని విమర్శించారు.

సీజేపీ నేతలకు పోలీసుల సమన్లు
మరోవైపు సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా జంతర్ మంతర్‌లోకి ప్రవేశించడం, మరో పార్టీ ఆస్తిలోకి చొరబడిన ఆరోపణలపై విచారణకు పిలిచింది.

శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారా?
అక్టోబర్ 10న సౌరవ్ దాస్, రంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున శాంతి బాండ్ సమర్పించి, ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడబోమని హామీ ఇచ్చారు. అయితే అక్టోబర్ 13న వీరిద్దరూ మరో సభ్యుడు అజింక్య షిండేతో కలిసి పోలీసు బారికేడ్లను దాటి జంతర్ మంతర్ గేట్లు ఎక్కినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ నినాదాలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌పైనా బీజేపీ ఎదురుదాడి
సీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటోందని బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా ఆరోపించారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ మార్చ్ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. కీలక విచారణకు ముందు అభిశంసన అంశాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదని విమర్శించారు.

ఆధారాలు చూపించాలన్న కాంగ్రెస్
కేంద్రం చేస్తున్న విదేశీ నిధుల ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు విదేశీ సంస్థల నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపిస్తున్న బీజేపీ అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఐబీ, రా సంస్థల పనితీరును ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిధులపై బహిరంగ చర్చ జరగాలని, ఆ చర్చకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మధ్యవర్తిగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: ఢిల్లీలో కూలిన మరో భవనం.. ఇద్దరు మృతి!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)