Breaking News

ఏఆర్‌ డెయిరీలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సోదాలు

Published on Sun, 09/22/2024 - 04:29

సాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్‌లో ఉన్న ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో శనివారం సెంట్రల్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు రెండు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. తిరుమలకు సరఫరా అయింది ఏఆర్‌ డెయిరీ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నెయ్యేనన్న సమాచారంతో దిండుగల్‌లోని ఆ ఉత్పత్తి కేంద్రంపై అందరి దృష్టి పడింది. దీంతో శుక్రవారం రాత్రి తమిళనాడు ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అనిత ఆ పరిశ్రమలో తనిఖీలు చేసి, వ్యర్థ జలాలను పరిశీలనకు తీసుకెళ్లారు.

అదే సమయంలో శనివారం సెంట్రల్‌ ఫుడ్‌ సేప్టీ అధికారి ఒకరితో పాటు మరి కొందరు సిబ్బంది ఆ పరిశ్రమలో సోదాలు చేశారు. ఏఆర్‌ డెయిరీకి చెందిన పాలు, నెయ్యి, పనీర్, వెన్న, పెరుగు, మజ్జిగ, స్వీట్లు తదితర ఉత్పత్తులను 2 గంటలకుపైగా పరిశోధించారు. వీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లారు. అదే సమయంలో ఏఆర్‌ డెయిరీ కంపెనీ తరఫున క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు లెని, కన్నన్‌ మీడియా ముందుకు వచ్చారు. తమ ఉత్పత్తులలో కల్తీకి ఆస్కారం లేదని, ఎవ్వరైనా సరే ఏ సమయంలోనైనా ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చని సూచించారు.

తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపించే ముందు పరిశీలించి, అందుకు సంబంధించిన సర్టీఫికెట్లను సిద్ధం చేస్తామని వివరించారు. జూన్, జూలై నెలల్లో పంపించామని, ఇప్పుడు అక్కడకు సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ సంస్థ పేరు బహిరంగంగా చెప్పనప్పటికీ, జరుగుతున్న పరిణామాలను చూసి వివరణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తమ ఉత్పత్తులు అన్ని చోట్ల ఉన్నాయని, ఏ సమయంలోనైనా సరే తనిఖీలు చేసుకోవచ్చునని సూచించారు. 16 వేల టన్నులను ఆ రెండు నెలలు నిరంతరాయంగా పంపిణీ చేశామని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల తనిఖీ, పరిశీలన సర్టిఫికెట్లు తమ వద్ద ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)