Breaking News

Maha Kumbh: యధేచ్ఛగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రచార దందా

Published on Wed, 01/15/2025 - 07:35

మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు, పర్యాటకులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రముఖ వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు సంగమ ప్రాంతంలో తమ ప్రచార దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నాయి.

ప్రముఖ అగ్రశ్రేణి బ్రాండ్లు, కార్పొరేట్ సంస్థలు(Corporate organizations) ప్రయాగ్‌ రాజ్‌లో తమ కొత్త దుకాణాలను తెరిచాయి. ఇవి తమ ఉత్పత్తుల శాంపిల్‌ ప్యాక్‌లను పర్యాటకులకు ఉచితంగా  పంపిణీ చేస్తూ, వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మార్కెట్లలో ధరలు పెరగడం, అమ్మకాలు తగ్గడం లాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న పలు బ్రాండ్లు మహా కుంభ్‌కు వచ్చే వినియోగదారులతో  నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ బ్రాండ్లు 45 రోజుల పాటు  జరిగే కుంభమేళాను తమ ఉత్పత్తుల ప్రచారానికి సద్వినియోగం చేసుకుంటున్నాయి.

మహా కుంభమేళాకు 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌(Reliance Industries)కు చెందిన ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్‌) సంగమ స్థలిలో కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేసి, తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తోంది. ప్రముఖ పరిశుభ్రత బ్రాండ్ డెటాల్ కుంభమేళాలో దాదాపు 15 వేల మంది పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇచ్చింది. వారికి సబ్బులను ఉచితంగా పంపిణీ చేసింది.

డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మోహిత్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ‘ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాల సమయంలో, మేము వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని  కోరుకుంటామన్నారు. మా  బ్రాండ్లు డాబర్ చ్యవన్‌ప్రాష్, డాబర్ హనీ, డాబర్ రెడ్ పేస్ట్, ఆమ్లా హెయిర్ ఆయిల్, వాటిక, హజ్మోలా, హోనిటస్‌ల గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇదేవిధంగా మంగళ్‌దీప్ అగరుబత్తుల కంపెనీ ఇక్కడ విరివిగా ప్రచారం సాగిస్తోంది.

కోకా-కోలా ఇండియా ఆసియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రీష్మా సింగ్ మాట్లాడుతూ  కుంభమేళాలో పునర్వినియోగ ప్యాకేజింగ్‌ను ప్రోత్సహిస్తున్నామని, వినియోగదారులలో రీసైక్లింగ్‌పై అవగాహన పెంచేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఐటీసీ ప్రతినిధి మాట్లాడుతూ, మంగళ్‌దీప్ అగర్బత్తితో సహా ఐటీసీకి చెందిన ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌లను ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని’ అన్నారు.

ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)