డెడ్‌ ఎకానమీయా?

Published on Tue, 12/16/2025 - 04:05

న్యూఢిల్లీ: భారత్‌ డెడ్‌ ఎకానమీ అయితే గ్లోబల్‌ ఏజెన్సీలు అంతంత గొప్ప రేటింగులు ఎలా ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విపక్షాలను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను డెడ్‌ ఎకానమీగా పేర్కొనడంపై కేంద్రం వివరణ ఇచ్చి తీరాలని విపక్షాలు సోమవారం లోక్‌సభలో పట్టుబట్టాయి. దాంతో నిర్మల మాట్లాడారు. విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని స్పష్టం చేశారు. 

సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏకంగా 8.2 శాతం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ గతంలో బయటి సాయంపై ఆధారపడేది. అలాంటిది గత పదేళ్లలో బయటి దేశాలకు ఆదర్శంగా మారేలా ఎదిగింది. డెడ్‌ ఎకానమీ అన్నదే నిజమైతే డీబీఆర్‌ఎస్, ఎస్‌ అండ్‌ పీ, సర్‌ అండ్‌ ఐ వంటి ప్రముఖ సంస్థలు మన క్రెడిట్‌ రేటింగ్‌ను పెంచుతాయా? ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవాలా? ఆరోపణలు చేసేది ఎంత పెద్దవారైనా సరే, గణాంకాలు ఏం చెబుతున్నాయన్నదే చూడాలి. వాటి ఆధారంగానే మాట్లాడాలి’’ అంటూ విపక్షాలకు మంత్రి నిర్మల హితవు పలికారు.

రూ. 41 వేల కోట్ల వ్యయానికి లోక్‌ సభ ఆమోదం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కీలక శాఖలకు సంబంధించి రూ.41,455 కోట్ల మేరకు అదనపు వ్యయానికి లోక్‌సభ అనుమతి మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన సప్లిమెంటరీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్‌లను సోమవారం ఆమోదించింది. దీన్ని బడ్జెట్‌ రూపకల్పనలో అసమర్థతగా విపక్ష ఎంపీలు చేసిన విమర్శలను మంత్రి నిర్మల తిప్పికొట్టారు. బాధ్యతాయుత ప్రభుత్వానికి ఇలాంటి సప్లిమెంటరీ డిమాండ్లు చాలా అవసరమన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని చెప్పారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)