Breaking News

జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు.. అంతటా హై అలర్ట్‌!

Published on Mon, 07/06/2026 - 12:17

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వరదలు రావడానికి తోడు కొండచరియలు విరిగిపడ్డాయి. కిష్త్వార్‌లోని 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో అక్కడి రహదారిపై వెళ్తున్న, నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి, వాహనాలను వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు దోడా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పౌరజీవనం అస్తవ్యస్తమైంది. దోడా జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో దోడా-కిష్త్వార్ రహదారిని సోమవారం ఉదయం అధికారులు పూర్తిగా మూసివేశారు. రహదారిపై భారీ బండరాళ్లు, బురద పేరుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు అత్యవసర వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. సంబంధిత శాఖల యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమైంది.

కొండ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడం, నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు తెలియరాలేదు. పరిపాలనా యంత్రాంగం హై అలర్ట్‌ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకూ అనవసర ప్రయాణాలు చేయవద్దని, తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు స్థానికులకు, ప్రయాణికులకు సూచించారు.

ఇది కూడా చదవండి: ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)