Breaking News

దేశపు తొలి మ్యూజికల్‌ రోడ్‌...వచ్చేసింది

Published on Fri, 02/20/2026 - 20:43

వాహనాల్లో వెళుతూ ఆడియోలో పాటలు వినడం కొత్త కాదు. కానీ  ఒక రోడ్‌ మీదకు వెళ్లగానే టైర్లు రహదారిని తాకగానే సంగీతం వినిపించడం ఎక్కడైనా కనీ విన్నామా? దేశపు తొలి మ్యూజికల్‌ రోడ్‌ మీదుగా వెళితే ఆ అనుభవం మన స్వంతమవుతుంది. ముంబై  కోస్టల్‌ రోడ్‌  దీనికి తొలి అడ్రెస్‌గా నిలిచింది. దక్షిణ దిశగా ఉన్న కోస్టల్‌ రోడ్‌  500 మీటర్ల పొడవు అధికారికంగా భారత దేశపు మొట్టమొదటి సంగీత రహదారి అనే ఘనతను దక్కించుకుంది.  ఈ రోడ్‌ మీదుగా వాహనదారులు నిర్ణీత వేగంతో  డ్రైవ్‌ చేస్తున్నప్పుడు సూపర్‌ హిట్‌ బాలీవుడ్‌ పాట జై హోను ఉప్పొంగే దేశభక్తితో పాటు వినవచ్చు.

ఈ ప్రత్యేకమైన ఇన్ స్టాలేషన్స్ ను ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రారంభించారు, ఇది పట్టణ మౌలిక సదుపాయాలు, సాంకేతికత సాంస్కృతిక వ్యక్తీకరణల  అరుదైన కలయికను సూచిస్తుంది. ఈ సంగీత విస్తరణ ప్రియదర్శిని పార్క్‌ అమర్స న్స్ గార్డెన్‌ మధ్య, నారిమన్‌ పాయింట్‌ నుంచి వర్లి కి ఉత్తరం వైపు,  క్యారేజ్‌వేలో, వాహనాలు కోస్టల్‌ రోడ్‌ సొరంగం నుంచి నిష్క్రమించే చోటుకు దగ్గరలో ఉంది.

హంగేరియన్‌ రోడ్‌ టెక్నాలజీ నుంచి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్‌... రోడ్డు ఉపరితలంపై ఖచ్చితమైన ఇంజనీరింగ్‌ గ్రూవ్‌లను ఉపయోగిస్తుంది. వీటిని రంబుల్‌ స్ట్రిప్స్‌ అని కూడా పిలుస్తారు. వాహనాలు ఈ గ్రూవ్‌ల మీదుగా గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు, టైర్ల ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలు సంగీత ప్రకంపనలను సృష్టిస్తాయి, ప్రస్తుతం ఇవి స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రం లోని గుల్జార్‌ సాహిత్యంతో ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన జై హో పాటను వీనుల విందుగా వినిపిస్తున్నాయి.

వాహనాల లోపల కూడా ఈ ట్యూన్‌ స్పష్టంగా వినిపిస్తూ వాహనదారులు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు అనూహ్యమైన  శ్రవణ అనుభవాన్ని అందిస్తుందని అధికారులు అంటున్నారు.  భద్రతను నిర్ధారించడానికి, బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సొరంగం లోపల సహా మ్యూజికల్‌ స్ట్రెచ్‌ ముందు 500 మీటర్లు, 100 మీటర్లు 60 మీటర్ల వద్ద ముందస్తు హెచ్చరిక సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది, దీని వలన డ్రైవర్లు ఆకస్మిక బ్రేకింగ్‌ లేకుండా క్రమంగా వేగాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.

మన దేశంలో ఫస్ట్‌.. ప్రపంచంలో ఫిఫ్త్‌...
ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్‌ రోడ్‌ కాగా ప్రపంచవ్యాప్తంగా  ఐదవది. మ్యూజికల్‌ లేదా మెలోడీ రోడ్‌ వరుసలో  మొదటిది 2007లో జపాన్ లో ప్రారంభించారు.   అప్పటి నుంచి హంగేరీ, దక్షిణ కొరియా యుఎఇ  వంటి దేశాలలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇది  ‘వాహనదారులకు సంతోషకరమైన అనుభవం‘ అని ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలకు మించి ప్రయాణికుల అనుభవాన్ని ఎలా మెరుగుపరచవచ్చో ఈ ప్రాజెక్ట్‌  ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇతర రహదారులపై కూడా వీటిని చూడవచ్చునని  ఆశాభావం వ్యక్తం చేశారు

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)