Breaking News

కేరళలో తొలిసారి.. భర్త స్థానంలో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన భార్య

Published on Mon, 09/02/2024 - 10:11

తిరువనంతపురం: కేరళలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వేణు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆగష్టు 31న పదవీ విరమణ చేశారు. వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్‌ సీఎస్‌ పదవి బాద్యతలు చేపట్టారు.

ఆమె గతంలో ప్రణాళిక విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్‌ ఆగష్టు 21న నిర్ణయం తీసుకుంది. కాగా కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త స్థానంలో భార్య బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

భర్త పదవీ విరమణ.. కేరళ కొత్త సీఎస్ భార్య

కాగా భార్యభర్తలిద్దరూ 1990 బ్యాచ్ ఐఏఎస్‌ అధికార్లే అయినప్పటికీ..  వేణు అతని భార్య కంటే కొన్ని నెలలు పెద్దవాడు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘తిరువనంతపురంలోని సచివాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారతదేశంలోనే తొలిసారిగా (ఎవరికైనా గుర్తున్నంత వరకు!) కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీ వేణు.. ఆయన భార్య శారదా మురళీధరన్‌కు సీఎస్‌ పదవిని అప్పగించారు.’ అని పేర్కొన్నారు.

శుక్రవారం వేణు వీడ్కోలు సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త వీ వేణు నుంచి శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారని అన్నారు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు