Breaking News

పూణె మెట్రో స్టేషన్‌లో మంటలు

Published on Mon, 10/21/2024 - 07:51

పూణె: మహారాష్ట్రలోని పూణెలోని ఒక మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం ఘటనా స్థలికి చేరుకుని, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు తెలిపారు.

పూణెలోని మండై మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన మెట్రో అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.

ఐదు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మెట్రో స్టేషన్‌లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఒక  ట్వీట్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్‌లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. 

 


ఇది కూడా చదవండి: పిరమిడ్‌పై పక్షుల వేట

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)