Breaking News

తండ్రి ఫోన్‌ రిపేర్‌ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య

Published on Sat, 03/15/2025 - 08:25

భోపాల్‌: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని భోపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏష్బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఒక యువకుడు తండ్రి తన ఫోన్‌ రిపేర్‌ చేయించలేదని  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలోని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫోన్‌ రిపేర్‌ చేయించలేననని, అలాగే కొత్త ఫోను కొనివ్వలేనని తండ్రి చెప్పాడంతో కుమారుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతితో ఆ తండ్రి కుమిలిపోతున్నాడు.

ఏష్బాగ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్‌ ఖాన్‌(18) బాగ్‌ ఫర్హత్‌ అఫజ్‌ పరిధిలోని ఓకాఫ్‌ కాలనీలో ఉంటున్నాడు. 12వ తరగతి పాసయిన సయీద్‌ ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలేజీలో చేరలేదు. నాలుగు రోజులుగా అతని ఫోను చార్జింగ్‌ కావడంలేదు. దీంతో ఆ ఫోనును రిపేర్‌ చేయించేందుకు మెకానిక్‌ దగ్గరకు తీసుకువెళ్లాడు. అతను ఫోను రిపేరు(Phone repair)కు చాలా ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని అతను తండ్రికి చెప్పాడు. అయితే తండ్రి తన దగ్గర డబ్బులు లేవని, ఆ ఫోనుకు రిపేర్‌ చేయించలేనని, కొత్తది కొనివ్వలేనని చెప్పడంతో సయీద్‌ కలత చెందాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సయీద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)